స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు నేడు అడ్డుకట్ట పడింది. అంతర్జాతీయంగా అమెరికా-చైనా వాణిజ్య యుద్ధ భయాలతో దేశీయ సూచీలు నేడు నష్టాలు నమోదు చేశాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 194 పాయింట్లు నష్టపోయింది. చివరకు 39,757 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 59 పాయింట్లు కోల్పోయి 11,906 వద్ద ట్రేడింగ్ ముగించింది.
ఇంట్రాడే సాగిందిలా
ఒడుదొడుకుల ట్రేడింగ్లో సెన్సెక్స్ 39,623-39,982 పాయింట్ల మధ్య కదలాడింది.
నిఫ్టీ ఇంట్రాడేలో 11,962 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. ఓ దశలో 11,866 పాయింట్ల కనిష్ఠానికి పడిపోయింది.
లాభనష్టాల్లోనివివే
టాటా స్టీల్ 2.60 శాతం, ఓఎన్జీసీ 0.77 శాతం, వేదాంత 0.68 శాతం, సన్ ఫార్మా, 0.47 శాతం, టీసీఎస్ 0.25 శాతం, రిలయన్స్ 0.19 శాతం లాభపడ్డాయి.
ఎస్ బ్యాంకు అత్యధికంగా 3.34 శాతం నష్టపోయింది. మారుతి 1.79 శాతం, కోటక్ బ్యాంకు 1.65 శాతం, హీరో మోటోకార్ప్ 1.55 శాతం, బజాజ్ ఆటో 1.38 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 1.23 శాతం నష్టాలను నమోదు చేశాయి.
ఇదీ చూడండి: నీరవ్ మోదీకి నాల్గో సారి బెయిల్ నిరాకరణ