తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆర్థిక భయాలతో జీవనకాల గరిష్ఠాన్ని కోల్పోయిన సెన్సెక్స్

స్టాక్ మార్కెట్లు నేడు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్​ 330 పాయింట్లు క్షీణించి.. జీవనకాల గరిష్ఠాన్ని కోల్పోయింది. నిఫ్టీ 104 పాయింట్ల నష్టంతో 12 వేల మార్క్​ దిగువకు చేరింది.

స్టాక్​ మార్కెట్లకు నష్టాలు

By

Published : Nov 8, 2019, 3:54 PM IST

స్టాక్ మార్కెట్ల రికార్డుల పరంపరకు నేడు బ్రేక్ పడింది. లాభాల స్వీకరణతో నేడు భారీ నష్టాలను నమోదు చేశాయి సూచీలు. కొన్ని ప్రైవేటు రంగ బ్యాంకులు మినహా దాదాపు అన్ని సంస్థలు నష్టాలను నమోదు చేశాయి. దేశ ఆర్థిక వృద్ధి మందగిస్తుందన్న భయాలు నేటి నష్టాలకు కారణం.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 330 పాయింట్లు కోల్పోయింది. చివరకు 40,324 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ- నిఫ్టీ 104 పాయింట్లు క్షీణించి..11,908 వద్దకు చేరింది.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్​ 40,749 పాయింట్ల వద్ద జీవనకాల గరిష్ఠాన్ని తాకగా.. ఉదయం లాభాల స్వీకరణతో 40,264 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.
నిఫ్టీ నేడు 12,034 పాయింట్ల అత్యధిక స్థాయి.. 11,889 పాయింట్ల అత్యల్ప స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

ఎస్​ బ్యాంకు 3.76 శాతం, ఇండస్​ఇండ్​ బ్యాంకు 3.08 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు 2.25 శాతం, కోటక్ బ్యాంకు 0.92 శాతం లాభాలను నమోదు చేశాయి.
సన్​ఫార్మా 4.23 శాతం, వేదాంత 3.39 శాతం, ఓఎన్​జీసీ 2.64 శాతం, టీసీఎస్​ 2.54 శాతం, హెచ్​యూఎల్​ 2.41 శాతం నష్టాలను మూటగట్టుకున్నాయి.

ఇదీ చూడండి: నోట్లరద్దు దేశంపై జరిగిన ఉగ్రదాడి: రాహుల్​ గాంధీ

ABOUT THE AUTHOR

...view details