తెలంగాణ

telangana

ETV Bharat / business

లాభాల స్వీకరణతో బుల్ జోరుకు బ్రేక్​ - నష్టాలు

లాభాల స్వీకరణతో స్టాక్ మార్కెట్లు నేడు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్​ 189 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 59 పాయింట్లు క్షీణించింది. బ్యాంకింగ్, ఆటోమొబైల్​ రంగ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి.

స్టాక్ మార్కెట్లు

By

Published : Aug 28, 2019, 4:04 PM IST

Updated : Sep 28, 2019, 2:59 PM IST

స్టాక్ మార్కెట్లకు లాభాలు మూన్నాళ్ల ముచ్చటగా మారాయి. కేంద్రం ఉద్దీపన ప్రకటనలతో గత మూడు సెషన్లలో భారీ లాభాలు నమోదు చేశాయి సూచీలు. ఈ నేపథ్యంలో లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు మదుపరులు. వీటికి తోడు ఆగస్టు డెరివేటివ్స్ గడువు దగ్గర పడుతుండటమూ నేటి నష్టాలకు కారణం.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 189 పాయింట్లు కోల్పోయింది. చివరకు 37,452 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 59 పాయింట్ల నష్టంతో 11,046 వద్దకు చేరింది.

ఇంట్రాడే సాగిందిలా

సెన్సెక్స్​ 37,687 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. 37,249 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.
నిఫ్టీ నేడు 11,129 పాయింట్ల అత్యధిక స్థాయి.. 10,989 పాయింట్ల అత్యల్ప స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

హెచ్​సీఎల్​టెక్​ 2.61 శాతం, ఇన్ఫోసిన్ 2.18 శాతం, టెక్​మహీంద్రా 2.10 శాతం, హెచ్​డీఎఫ్​సీ 0.51 శాతం, టీసీఎస్ 0.18 శాతం లాభాలను నమోదు చేశాయి.

ఎస్​ బ్యాంకు అత్యధికంగా 7.47 శాతం నష్టపోయింది. వేదాంత 4.06 శాతం, టాటా స్టీల్ 4.02 శాతం, టాటా మోటార్స్ 3.28 శాతం, ఓఎన్​జీసీ 3.18 శాతం నష్టాలను మూటగట్టుకున్నాయి.

Last Updated : Sep 28, 2019, 2:59 PM IST

ABOUT THE AUTHOR

...view details