వారంలో రెండో రోజూ లాభాలతో ముగిశాయి స్టాక్ మార్కెట్లు. కేంద్రానికి రూ.1.76 లక్షల కోట్లు బదిలీ చేసేందుకు ఆర్బీఐ అంగీకరించిన నేపథ్యంలో మరిన్ని సంస్కరణలపై అంచనాలు పెరిగాయి. ఇప్పటికే ప్రభుత్వ బ్యాంకులకు రూ.70 వేల కోట్ల మూలధన ప్రోత్సాహాన్ని అందించనున్నట్లు ప్రకటించింది కేంద్రం. ఇప్పుడు సంక్షోభంలో ఉన్న వాహనరంగానికి ప్రోత్సాహకాలు ప్రకటించే అవకాశముందని అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్, వాహన రంగాలు దూసుకెళ్లాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 147 పాయింట్లు బలపడింది. చివరకు 37,641 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 47 పాయింట్ల వృద్ధితో 11,105 వద్దకు చేరింది.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 37,731 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. 37,450 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.
నిఫ్టీ నేడు 11,142 పాయింట్ల అత్యధిక స్థాయి.. 11,049 పాయింట్ల అత్యల్ప స్థాయిల మధ్య కదలాడింది.