కార్డుల వ్యాపారాల్లో వాటాను తగ్గించుకునే దిశగా భారతీయ స్టేట్ బ్యాంకు అడుగులు వేస్తోంది. ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) మార్గంలో తమ వాటాను తగ్గించుకోనున్నట్లు ఎస్బీఐ వెల్లడించింది.
'ఎస్బీఐ కార్డ్స్, పేమెంట్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్' సంస్థలో 74 శాతం వాటా ప్రస్తుతం ఎస్బీఐ చేతిలో ఉంది.
వాటను తగ్గించుకునేందుకు ఎస్బీఐ ఎగ్జిక్యూటివ్ కమిటీ తాజా సమావేశంలో ప్రాథమిక అమోదం లభించింది. వాటా తగ్గింపునకు ఉన్న అన్ని అవకాశాలను పరిశీలించాలని కమిటీ సూచించింది.
ఎస్బీఐ ప్రతిపాదించిన ఈ 'ఐపీఓ'కు రిజర్వు బ్యాంకు సహా ఇతర నియంత్రణ సంస్థలు అమోదం లభించాల్సి ఉంది.
తుది అనుమతులు లభించిన తర్వాత 'ఐపీఓ' తేదీని ప్రకటిస్తామని ఎస్బీఐ పేర్కొంది. అయితే ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలోనే 'ఐపీఓ' ఉండొచ్చని ఎస్బీఐ ఛైర్మన్ రజనీశ్ కుమార్ ఇటీవల తెలిపారు.
ఎస్బీఐ కార్డుల వ్యాపార ప్రస్థానం
- 1998 డిసెంబర్లో ఎస్బీఐ కార్డులు అందుబాటులోకి వచ్చాయి.
- తొలుత వీటి కార్యకలాపాలు 'జీఈ క్యాపిటల్' సంస్థ నిర్వహించేది.
- 2017 డిసెంబర్లో ఎస్బీఐ, 'కార్లెల్ గ్రూపు'లు సంయుక్తంగా 'జీఈ గ్రూపు'ను స్వాధీనం చేసుకున్నాయి.
- ఈ స్వాధీనం ద్వారా ఎస్బీఐ 74 శాతం వాటా, కార్లెల్ గ్రూపు 26 శాతం వాటాను దక్కించుకున్నాయి.
ఇదీ చూడండి: 'అమెజాన్ అసిస్టెంట్' సేవలు ఇక హిందీలోనూ...