అన్ని రకాల రుణాలపై 15 బేసిస్ పాయింట్లు వడ్డీ తగ్గించింది ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ. రెపో రేటు తగ్గిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. ఎస్బీఐ వడ్డీ కోత విధించింది. తగ్గిన వడ్డీ రేట్లు ఆగస్టు 10 నుంచి అమలు కానున్నాయి.
ఈ సవరణతో ఎస్బీఐ మార్జినల్ కాస్ట్ ఆధారిత వడ్డీ రేటు(ఎంసీఎల్ఆర్).. ఏడాది కనిష్ఠం వద్ద 8.25 శాతానికి చేరింది.