ఎస్బీఐ ఇచ్చే అన్ని రకాల రుణాలపై వడ్డీ రేట్లు (మార్జినల్ కాస్ట్-లెండింగ్ రేట్) 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఈ ఎంసీఎల్ఆర్ కోతతో వడ్డీ రేటు 8.5 శాతం నుంచి 8.45 శాతానికి చేరనుంది. తగ్గిన వడ్డీ రేట్లు నేటి నుంచి అమలులోకి వచ్చాయి.
ఈ ఆర్థిక సంవత్సరంలో ఎస్బీఐ వడ్డీ రేట్ల కోత విధించడం ఇది రెండో సారి. మొదటగా గత నెల ద్రవ్య పరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీ రేట్లను 25 బెసిస్ పాయంట్లు తగ్గిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఎస్బీఐ 5 బేసిస్ పాయింట్ల ఎంసీఎల్ఆర్ను తగ్గించింది.