తెలంగాణ

telangana

ETV Bharat / business

ఎస్​బీఐ కార్డ్స్​కు షాక్- ఐపీఓకు వచ్చిన తొలిరోజే నష్టాలు - మార్కెట్​ వార్తలు తాజా

ఎస్​బీఐ కార్డ్స్​ ఐపీఓ తొలిరోజే నష్టాలు మూటగట్టుకుంది. ఐపీఓ ధర షేరుకు రూ. 755గా నిర్ణయించగా దాదాపు 13 శాతం పడిపోయింది.

SBI Cards makes weak debut at bourses; plunges nearly 13 pc
ఎస్​బీఐ కార్డ్స్​: ఐపీఓకు వచ్చిన తొలిరోజే నష్టాలు

By

Published : Mar 16, 2020, 1:03 PM IST

ఎస్​బీఐ కార్డ్స్​ అండ్​ పేమెంట్​ సర్వీసెస్ షేర్లు​ ఐపీఓకు వచ్చిన తొలిరోజే నష్టాల బాట పట్టాయి. ఐపీఓ ధర రూ.755కు గాను 13 శాతం క్షీణించింది.

బీఎస్​ఈలో షేరు ధర రూ.658 లిస్ట్​ చేయగా.. ఇష్యూ ధర నుంచి 12.84 శాతం పడిపోయాయి. ఎన్‌ఎస్‌ఈలో రూ.661తో ప్రారంభమై 12.45 శాతం క్షీణించాయి.

బీఎస్‌ఈలో కంపెనీ మార్కెట్ విలువ రూ .69,811.44 కోట్లుగా ఉంది. మార్కెట్ సెంటిమెంట్‌ బలహీనంగా ఉండటమే కంపెనీ షేర్ల నష్టాలకు కారణం.

ఈ ఐపీఓ ద్వారా దాదాపు రూ.10,000 కోట్లకు పైగా సమీకరించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకు ఎస్​బీఐ కార్డ్ అండ్ పేమెంట్ సర్వీసెస్​​... స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అనుబంధ సంస్థగా పనిచేసింది.

బీఎస్‌ఈ సెన్సెక్స్​ 2,000 పాయింట్లకు పైగా నష్టంతో ట్రేడ్ అవుతోంది. మార్కెట్​ ఆరంభంలో బీఎస్‌ఈలో 17.65 లక్షల షేర్లు, ఎన్‌ఎస్‌ఈలో 2.6 కోట్ల షేర్లు ట్రేడయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details