తెలంగాణ

telangana

ETV Bharat / business

జియోకు మరో రూ.11,367 కోట్ల విదేశీ పెట్టుబడి - జియోలో సౌదీ సంస్థ పెట్టుబడి

జియోకు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే 9 సంస్థలు రూ.104,326 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టగా.. తాజాగా మరో విదేశీ సంస్థ భారీ పెట్టుబడి పెట్టింది. సౌదీకి చెందిన ప్రముఖ సావరిన్ ఫండ్ సంస్థ పీఐఎఫ్​ రూ.11,367 కోట్లతో జియో ప్లాట్​ఫామ్స్​లో 2.32 శాతం వాటాను కొనుగోలు చేసింది.

jio pif deal
జియో పీఐఎఫ్​ భారీ డీల్​

By

Published : Jun 18, 2020, 4:50 PM IST

Updated : Jun 18, 2020, 4:58 PM IST

ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియోలో మరో విదేశీ సంస్థ భారీ పెట్టుబడి పెట్టింది. సౌదీకి చెందిన సావరిన్ ఫండ్.. పబ్లిక్ ఇన్వెస్ట్​మెంట్ ఫండ్(పీఐఎఫ్) 2.32 శాతం వాటా కొనుగోలు చెసింది. రూ. 11,367 వేల కోట్లతో ఈ వాటాను దక్కించుకుంది పీఐఎఫ్​.

ఇప్పటికే 9 విదేశీ సంస్థలు జియో ప్లాట్​ఫామ్స్​లో 22.38 శాతం వాటాను దక్కించుకున్నాయి. ఈ సంస్థలు జియోలో మొత్తం రూ.104,326.95 కోట్లు పెట్టుబడి పెట్టాయి. తాజా పెట్టుబడితో జియోకు 9 వారాల్లో వచ్చిన మొత్తం పెట్టుబడులు రూ.115,693.95 కోట్లకు చేరింది.

పీఐఎఫ్ మినహా మిగతా సంస్థ పెట్టుబడులు ఇలా

జియో ప్రణాళిక..

2021 వరకు సంస్థను రుణరహితంగా మార్చాలని రిలయన్స్ భావిస్తోంది. ఇందులో భాగంగానే జియో వరుస పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఇందుకోసం జియోలో 25 శాతం మైనారిటీ వాటాను వాటాదార్లకు విక్రయించాలని నిర్ణయించింది. పీఐఎఫ్ ఒప్పందంతో జియోలో వాటా విక్రయాల ప్రక్రియ దాదాపు పూర్తయినట్లేనని తెలుస్తోంది.

ఇదీ చూడండి:ఏజీఆర్ బకాయిలు చెల్లించండి.. కష్టాల్లో ఉన్నాం ప్లీజ్!

Last Updated : Jun 18, 2020, 4:58 PM IST

ABOUT THE AUTHOR

...view details