ప్రీమియం స్మార్ట్ ఫోన్ల అమ్మకాల్లో ఎలక్ట్రానిక్ దిగ్గజం శామ్సంగ్ అగ్రగామిగా నిలిచింది. ఎస్ 10 సీరీస్ అందించిన విజయంతో ఈ ఏడాది తొలి త్రైమాసికానికి ఈ ఘనతను సాధించింది శామ్సంగ్. మూడు నెలల కాలానికి గానూ 65.9 శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకుంది.
ప్రీమియం స్మార్ట్ ఫోన్లలో అగ్రగామిగా శామ్సంగ్
స్మార్ట్ ఫోన్ల అమ్మకాల్లో మరోసారి సత్తా చాటింది శామ్సంగ్. గెలాక్సీ ఎస్ సిరీస్ ఫోన్లు అందించిన ప్రోత్సాహంతో మార్చి నెలకు గాను 77 శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకుంది.
శామ్సంగ్
మార్చిలో ప్రీమియం స్మార్ట్ ఫోన్ల విభాగంలో ఏకంగా 77 శాతం మార్కెట్ వాటాను దక్కించుకున్నట్లు శామ్సంగ్ ఇండియా స్మార్ట్ఫోన్ వ్యాపారాల డైరెక్టర్ ఆదిత్య బబ్బర్ తెలిపారు.
దక్షిణ కొరియాకు చెందిన ఈ ఎలక్ట్రానిక్ దిగ్గజం.. సంస్థ వార్షికోత్సవం సందర్భంగా గెలాక్సీ ఎస్ సీరీస్లో ఎస్10 ప్లస్, ఎస్10, ఎస్10ఈ మోడళ్లను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ మూడు స్మార్ట్ ఫోన్లు భారత్లోనే తయారవుతుండటం విశేషం.