తెలంగాణ

telangana

ETV Bharat / business

భారత్​లో శాంసంగ్ మడత ఫోన్ ధరెంతో తెలుసా!

భారత్​లో మడత ఫోన్ విడుదలపై స్పష్టతనిచ్చింది శాంసంగ్. ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడుతూ వస్తున్న గెలాక్సీ ఫోల్డ్​ను​.. ఎట్టకేలకు అక్టోబర్ 1న అవిష్కరించనున్నట్లు వెల్లడించింది.

By

Published : Sep 26, 2019, 4:36 PM IST

Updated : Oct 2, 2019, 2:40 AM IST

గెలాక్సీ ఫోల్డ్

స్మార్ట్​ ఫోన్ ప్రియుల నిరీక్షణకు తెరదించుతూ.. భారత్​లో మడత ఫోన్​ విడుదల తేదీని ప్రకటించింది శాంసంగ్​. అక్టోబరు 1న భారత్‌లో గెలాక్సీ ఫోల్డ్‌ను ఆవిష్కరించనున్నట్లు అధికారికంగా వెల్లడించింది. అయితే భారత్​లో ఈ ఫోన్​ ధరపై స్పష్టనివ్వలేదు శాంసంగ్​.

దక్షిణ కొరియాలో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఈ ఫోన్​ ధర స్థానిక కరెన్సీ ప్రకారం 2.398 మిలియన్ వాన్​లు(భారత కరెన్సీలో ఈ విలువ రూ.లక్ష 43 వేల పైమాటే). ఈ లెక్కన భారత్​లో గెలాక్సీ ఫోల్డ్​ రూ. 1,40,000 నుంచి రూ. 1,50,000ల వరకు ఉండొచ్చని టెక్ వార్తా సంస్థలు అంచనా వేస్తున్నాయి.

అక్టోబర్​ 1న మార్కెట్లోకి వచ్చిన తర్వాత.. ఫోన్​ ధర, విక్రయాల తేదీలపై స్పష్టత రానుంది. తొలుత భారత్​లోనే ఈ ఫోన్​ను విడుదల చేయాలనుకుంది శాంసంగ్​. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల విడుదల తేదీని వాయిదా వేసింది.

గెలాక్సీ ఫోల్డ్​ ఫీచర్లు..

  • మడతబెట్టినప్పుడు 4.6 అంగుళాల డిస్​ప్లే
  • మడత తీస్తే..7.3 అంగుళాల భారీ డిస్​ప్లే
  • ఆక్టాకోర్​ ప్రాసెసర్​
  • 12జీబీ ర్యామ్‌/512జీబీ స్టోరేజి
  • 16ఎంపీ+12ఎంపీ+12ఎంపీలతో వెనుకవైపు మూడు కెమెరాలు
  • 10 మెగా పిక్సల్​ సెల్ఫీ కెమెరా
  • ఆండ్రాయిడ్‌ పై ఆపరేటింగ్‌ సిస్టమ్‌
  • 4380 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం

​​​​​​​ఇదీ చూడండి: ఆఫర్ల సీజన్​: కొత్త కారు ఇప్పుడు కొనడమే మంచిదా?

Last Updated : Oct 2, 2019, 2:40 AM IST

ABOUT THE AUTHOR

...view details