తెలంగాణ

telangana

ETV Bharat / business

ఐఓసీని వెనక్కినెట్టిన రిలయన్స్ ఇండస్ట్రీస్ - ఎస్​బీఐ

ఫార్చూన్ గ్లోబల్ 500 జాబితాలో ఐఓసీని వెనక్కి నెట్టింది రిలయన్స్ ఇండస్ట్రీస్. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని ఈ కంపెనీ ఈ జాబితాలో 106వ స్థానాన్ని దక్కించుకుంది.

రిలయన్స్ ఇండస్ట్రీస్

By

Published : Jul 24, 2019, 1:11 PM IST

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫార్చూన్ గ్లోబల్ 500 జాబితాలో 106వ స్థానాన్ని దక్కించుకుంది. గత ఏడాదితో పోలిస్తే 42 స్థానాలు ఎగబాకింది ముకేశ్ అంబానీ నేతృత్వంలోని పరిశ్రమల దిగ్గజం.

2010లో ఫార్చూన్ జాబితా ప్రారంభించినప్పటి నుంచి అగ్ర స్థానంలో (భారత్​ నుంచి) ఉంటున్న ఇండియన్ ఆయిల్​ కార్పొరేషన్ (ఐఓసీ)ని వెనక్కి నెట్టింది రిలయన్స్. ఈ ఏడాది ఫార్చూన్ గ్లోబల్ 500 జాబితాలో 117వ స్థానంతో సరిపెట్టుకుంది ఐఓసీ.

ఫార్చూన్ గ్లోబల్ 500 జాబితాలో అమెరికాకు చెందిన 'వాల్​మార్ట్' మళ్లీ ప్రథమ స్థానాన్ని నిలబెట్టుకుంది.

రిలయన్స్ ఆదాయం 32 శాతం వృద్ధి

2018-19 నాటికి రిలయన్స్ ఆదాయం 32.1 శాతం పెరిగి.. 82.3 బిలియన్ డాలర్లకు చేరింది. 2017-18లో సంస్థ ఆదాయం 62.3 బిలియన్​ డాలర్లుగా ఉంది.

ప్రభుత్వ రంగ సంస్థ ఐఓసీ ఆదాయం 2018-19 నాటికి 17.7 శాతం వృద్ధితో 77.6 బిలియన్ డాలర్లుగా నమోదైంది. 2017-18లో సంస్థ ఆదాయం 65.9 బిలయన్ డాలర్లుగా ఉంది.

ఫార్చూన్ జాబితాలో 7 భారత కంపెనీలు

రిలయన్స్, ఐఓసీ మినహా ఫార్చూన్ గ్లోబల్ 500లో చోటు దక్కించుకున్న కంపెనీల్లో.. ఓఎన్​జీసీ (160), ఎస్​బీఐ (236), టాటా మోటార్స్ (265), బీపీసీఎల్ (275)​, రాజేశ్ ఎక్స్​పోర్ట్స్ (495)​ సంస్థలు ఉన్నాయి.

ఇదీ చూడండి: 'వచ్చే రెండేళ్లలో తగ్గనున్న భారత వృద్ధిరేటు'

ABOUT THE AUTHOR

...view details