మార్కెట్లోకి ప్రవేశిస్తూనే సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో మరో రికార్టు సాధించింది. ఎయిర్‌టెల్‌ను వెనక్కి నెట్టి.. 27.80 శాతం మార్కెట్ వాటాతో దేశంలో రెండో అతి పెద్ద టెలికాం ఆపరేటర్‌గా నిలిచింది జియో. టెలికాం నియంత్రణ సంస్థ 'ట్రాయ్' వెల్లడించిన తాజా గణాంకాల్లో ఈ విషయం వెల్లడైంది.
33.36 శాతం మార్కెట్ వాటాతో వొడాఫోన్- ఐడియా ప్రథమ స్థానంలో ఉండగా.. 27.58 శాతం మార్కెట్ వాటాతో ఎయిర్టెల్ మూడో స్థానానికి పడిపోయింది. 2019 మే 31 నాటికి ఉన్న మార్కెట్ వాటా ఆధారంగా 'ట్రాయ్' గణాంకాలు వెల్లడించింది. ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ మే నెలలో 2,125 మంది వినియోగదారులను చేర్చుకుంది.