తెలంగాణ

telangana

ETV Bharat / business

'పబ్​జీ లైట్'​ ఆడితే.. జియో రివార్డుల పంట! - రివార్డుల పంట

యువతను ఎక్కువగా ఆకర్షిస్తున్న పబ్​జీ గేమ్ తమ​ యూజర్లకు సరికొత్త అనుభూతి ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇందుకోసం జియోతో కలిసి 'పబ్​జీ లైట్'​ను తీసుకురానున్నట్లు పబ్​జీ కార్పొరేషన్ ప్రకటించింది.

జియో రివార్డుల పంట!

By

Published : Jul 13, 2019, 4:25 PM IST

ఇటీవల యవతను విపరీతంగా ఆకర్షిస్తున్న ఆన్​లైన్​ గేమ్​ 'పబ్​జీ'. ఈ గేమ్​ సైజు పెద్దగా ఉండటం కారణంగా ప్రస్తుతం హై ఎండ్ ఫోన్లు, కంప్యూర్లలో మాత్రమే ఆడేందుకు వీలుంటోంది. ఈ అంతరాన్ని తగ్గించేందుకు జియోతో కలిసి 'పబ్​జీ లైట్​' బీటా వెర్షన్​ను ఆవిష్కరించినట్లు పబ్​జీ మాతృ సంస్థ ఇటీవల ప్రకటించింది.

సరికొత్త గేమింగ్ అనుభూతిని ఇచ్చేందుకు 'పబ్​జీ లైట్'​ యూజర్లకు రిలయన్స్​ జియో ప్రత్యేక రివార్డులు ఇవ్వనునున్నట్లు తెలిపింది.

జియో రివార్డులు ఎలా పొందాలంటే..

  • రివార్డులు పొందేందుకు జియో యూజర్లు https://gamesarena.jio.com లాగ్​ అయ్యి.. అందులో వచ్చే ఫారం నింపాలి.
  • మొదటి దశ పూర్తయిన తర్వాత యూజర్ల మెయిల్​ ఐడీకి ఒక వెరిఫికేషన్ లింక్​ వస్తుంది.
  • వెరిఫికేషన్ పూర్తయ్యాక.. ప్రత్యేకమైన కోడ్​తో మరో మెయిల్ వస్తుంది. ఆ కోడ్​ను గేమ్​లో వినియోగించి రివార్డులు గెలవచ్చు.

ఇదీ చూడండి: సగం ధరకే అమెజాన్ ప్రైమ్ సబ్​స్క్రిప్షన్​!

ABOUT THE AUTHOR

...view details