చైనా దిగ్గజ సంస్థ షియోమీ రెడ్‌మీ సిరీస్‌లో మరో మోడల్ 'రెడ్‌మీ నోట్7 ప్రో'భారత విపణిలోకి అడుగుపెట్టనుంది. సరికొత్త హంగులతో తయారైన ఈ మోడల్ ఆన్లైన్లో వినియోగదారులకుఅందుబాటులో ఉండనుంది.రెండు వేరియంట్లలో నోట్7 ప్రో విడుదలకు సిద్ధమైంది.
రెడ్‌మీ నోట్ 7 ప్రో రెడీ... - మార్చి 13 నుంచి 'రెడ్‌మీ నోట్ 7 ప్రో'
చైనా దిగ్గజ సంస్థ షియోమీ... రెడ్‌మీ సిరీస్‌లో మరో ఫోన్‌తో మార్కెట్లోకి వస్తోంది. నేటి నుంచి 'రెడ్‌మీ నోట్ 7 ప్రో' అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.
రెడ్‌మీ నోట్ 7 ప్రో
రెడ్‌మీ నోట్ 7 ప్రో ప్రత్యేకలు
- 4జీబీ ర్యామ్/64 జీబీ మెమోరీ కలిగిన ఈఫోన్ధర రూ.13,999...6జీబీ ర్యామ్/64 జీబీ ఫోన్ధర రూ. 16,999. 15వేల రూపాయల కంటే తక్కువ ధరలో ఫోన్లు తయారు చేస్తోన్న శాంసంగ్, నోకియా తదితరసంస్థలకు ఈ మోడల్ ఫోన్లతోమరింత పోటీ పెరగనుంది.
- కార్నింగ్ గోరిల్లా గ్లాస్ 5, ఐఆర్ బ్లాస్టర్, టైప్ సీ పోర్ట్, డాట్ నాచ్ డిస్‌ప్లే ఈ స్మార్ట్ఫోన్కున్న మరిన్ని ప్రత్యేకతలు. ఇంతకు ముందు మోడళ్ల కన్నా రెడ్‌మీ నోట్ 7 ప్రో తెర కాస్త పెద్దగా ఉండనుంది.
- రెడ్‌మీ నోట్ 7, నోట్ 7ప్రో మధ్య తేడాలు:
ప్రత్యేకతలు\మోడల్ | రెడ్‌మీ నోట్ 7ప్రో | రెడ్‌మీ నోట్ 7 |
డిస్‌ప్లే | 6.3 అంగుళాల ఫుల్ హెచ్‌డీ | 6.3 అంగుళాల ఫుల్ హెచ్‌డీ |
ర్యామ్ | 4జీబీ, 6 జీబీ | 3 జీబీ, 4 జీబీ |
ఇంటర్నల్ స్టోరేజీ | 64 జీబీ, 128 జీబీ | 32జీబీ, 64 జీబీ |
ప్రాసెసర్ | స్నాప్‌డ్రాగన్ 675 | స్నాప్‌డ్రాగన్ 660 |
వెనుక కెమెరా | 48+ 5 మెగాపిక్సెల్ | 12+2 మెగాపిక్సెల్ |
ముందు కెమెరా | 13 మెగాపిక్సెల్ | 13 మెగాపిక్సెల్ |
బ్యాటరీ | 4000 ఎంఏహెచ్ | 4000 ఎంఏహెచ్ |
ఆపరేటింగ్ సిస్టమ్ | ఆండ్రాయిడ్ 9 పై, ఎంఐయూఐ 10 | ఆండ్రాయిడ్ 9 పై, ఎంఐయూఐ 10 |
ఫోన్ల రంగులు | నెబ్యులా రెడ్, నెప్ట్యూన్ బ్లూ, స్పేస్ బ్లాక్ | రూబీ రెడ్, సాఫైర్ బ్లూ, ఓనిక్స్ బ్లాక్ |
ధర | 4జీబీ+64జీబీ- రూ.13,999 6జీబీ+128జీబీ- రూ.16,999 | 3జీబీ+32జీబీ- రూ.9,999 4జీబీ+64జీబీ- రూ.11,999 |
- యాక్సిస్ బ్యాంకు కార్డుతో చెల్లింపులు చేసినవారికి ఐదు శాతం ఎక్కువ డిస్కౌంట్ లభిస్తుందని షియోమీ పేర్కొంది.రెడ్‌మీ నోట్ 7 ప్రో కొనుగోలు చేసిన వారికి 'జియో' నుంచి డబుల్ డేటా ఆఫర్‌తో పాటు రూ.2,400 క్యాష్‌బ్యాక్ ఓచర్లు లభించనున్నాయి. రూ.198 రీఛార్జ్‌పై డబుల్ డేటా, రూ.299 రీఛార్జ్‌పై క్యాష్‌బ్యాక్ ఆఫర్లున్నాయి. ఈ క్యాష్‌బ్యాక్ మై జియో వ్యాలెట్‌లో క్రెడిట్ అవుతుంది.
Last Updated : Mar 13, 2019, 6:50 AM IST