తెలంగాణ

telangana

ETV Bharat / business

రియల్​మీ 5జీ స్మార్ట్​ఫోన్ విడుదల నేడు-కీలక ఫీచర్లు ఇవే! - 5g smartphone in india

భారత మార్కెట్లో నేడు 5జీ స్మార్ట్​ఫోన్​ను ఆవిష్కరించనుంది రియల్​మీ. మొత్తం ఆరు కెమెరాలతో (వెనుక వైపు 4, ముందు వైపు 2) ఈ మోడల్​ విడుదల కానుంది. వీటితో పాటు రియల్​మీ అధికారికంగా లీక్​ చేసిన కొన్ని ఫీచర్లు సహా ధర వంటి వివరాలు మీ కోసం.

REALME 5G PHONE FEATURES
రియల్​ మీ 5జీ స్మార్ట్​ఫోన్ ఫీచర్లు

By

Published : Feb 24, 2020, 6:58 AM IST

Updated : Mar 2, 2020, 8:58 AM IST

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్​ఫోన్ తయారీ సంస్థ రియల్​ మీ.. భారత్​లో నేడు తొలి 5జీ స్మార్ట్​ఫోన్​ను ఆవిష్కరించనుంది. రియల్​మీ ఎక్స్​50 ప్రో 5జీ పేరుతో మార్కెట్లోకి ఈ మోడల్​ను​ తీసుకురానుంది. భారత్​తో పాటే స్పెయిన్​లోనూ నేడే ఈ మోడల్​ విడుదల కానుంది. రస్ట్​ రెడ్​, మోస్​ గ్రీన్​ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులోకి తెనుంది.

విడుదలకు ముందే 5జీ మోడల్​ ఫీచర్లు కొన్ని లీక్​ చేసింది రియల్​మీ. ఇప్పటి వరకు లీక్​ ఫీచర్లతో మార్కెట్​​ వర్గాల్లో రియల్​మీ 5జీ స్మార్ట్​ఫోన్​పై అంచనాలు భారీగా పెరిగాయి. మరి రియల్​మీ 5జీ స్మార్ట్​ఫోన్​ విశేషాలేంటో మీరూ చూసేయండి.

డిస్​ప్లే..

90 హెచ్​జెడ్​ సూపర్ ఆమోలోడ్​ ఫుల్ హెచ్​డీ డిస్​ప్లేను ఎక్స్​50 ప్రోలో పొందుపరిచారు.

కెమెరాలు..

మొత్తం ఆరు కెమెరాలతో ఈ ఫోన్ మార్కెట్లోకి రానుంది. అందులో నాలుగు వెనుకవైపు, రెండు ముందువైపు ఉండనున్నాయి.

ఆరు కెమెరాలు ఇలా

వెనుకవైపు కెమెరాలు 64 మెగా పిక్సళ్లు​, ఏఐ సాంకేతికతతో పనిచేయనున్నాయి. 20 ఎక్స్​ జూమ్​ సదుపాయం ఉండనుంది.

ముందువైపు డ్యుయల్​ అల్ట్రావైడ్​ సెల్ఫీ కెమెరాలను పొందుపరిచింది రియల్​మీ.

రియర్​ కెమెరాతో తీసిన ఫోటో

ఫాస్ట్​ ఛార్జింగ్​..

65 వాట్ల సూపర్ డార్ట్​ ఛార్జింగ్​ సపోర్ట్​తో ఈ మోడల్ అందుబాటులోకి రానుంది. దీని బ్యాటరీ సామర్థ్యం మాత్రం ఫోన్ విడుదలైన తర్వాతే తెలియనుంది.

ప్రాసెసర్​..

క్వాల్కమ్ 865పై 5జీ ప్రాసెసర్​తో ఈ స్మార్ట్​ఫోన్​ను మార్కెట్లోకి తేనుంది రియల్​మీ. ఈ ప్రాసెసర్​తో అందుబాటులోకి వస్తున్న తొలి స్మార్ట్​ఫోన్ ఇదే కావడం గమనార్హం.

రియల్ మీ 5జీ ఫోన్ ప్రాసెసర్​

5జీ ఫోన్​ ధర..

భారత మార్కెట్లో ఈ మోడల్​ ధర దాదాపు రూ.50,000గా ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

5జీ పోటీ..

భారత్​లో 5జీ స్మార్ట్​ఫోన్ విడుదలకు చైనా కంపెనీలు వరుసగా సిద్ధమవుతున్నాయి. రేపే చైనాకు చెందిన మరో సంస్థ 'ఐక్యూ' 5జీ స్మార్ట్​ఫోన్​తో భారత మార్కెట్లోకి ప్రవేశిస్తోంది.

ఇదీ చూడండి:ఆపరేషన్​ ఏజీఆర్​: 'ఐడియా' కోసం కేంద్రం కీలక భేటీ

Last Updated : Mar 2, 2020, 8:58 AM IST

ABOUT THE AUTHOR

...view details