తెలంగాణ

telangana

ETV Bharat / business

ఒకే రోజు రూ.1,113 పెరిగిన బంగారం ధర - శక్తికాంతదాస్

భారీగా పెరిగిన బంగారం ధర

By

Published : Aug 7, 2019, 11:23 AM IST

Updated : Aug 7, 2019, 4:00 PM IST

15:56 August 07

జీవితకాల గరిష్ఠానికి బంగారం ధర

బంగారం ధర భారీగా పెరిగింది. నేడు ఒక్కరోజే దిల్లీలో 10 గ్రాముల పసిడి వెల రూ.1,113 ఎగబాకి, రూ.37వేల 920కి చేరింది. చరిత్రలో బంగారం ధర ఈ స్థాయికి పెరగడం ఇదే తొలిసారి. 

అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం నేపథ్యంలో మదుపర్లు బంగారం కొనుగోళ్లకు మొగ్గుచూపడం ఈ భారీ పెరుగుదలకు కారణం.

వెండి ధర కిలోకు రూ.650 పెరిగి రూ.43,670కి చేరింది. 

15:44 August 07

అమ్మకాల ఒత్తిడి

స్టాక్ మార్కెట్లు నేడు భారీ నష్టాలతో ముగిశాయి. ఆర్బీఐ రెపో రేటు తగ్గింపు రుచించని మదుపరులు అమ్మకాలకు మొగ్గు చూపారు.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 286 పాయింట్లు నష్టపోయింది. చివరకు 36,690 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 93 పాయింట్ల నష్టంతో 10,855 వద్ద ముగిసింది.
 

14:08 August 07

వడ్డీ రేట్లు తగ్గించిన ఎస్​బీఐ

  • అన్ని రకాల రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించిన ఎస్​బీఐ
  • 15 బేసిస్ పాయింట్లు వడ్డీ తగ్గిస్తూ నిర్ణయం
  • ఏడాది కనిష్టం వద్ద.. 8.25 శాతానికి చేరిన వడ్డీ రేట్లు
  • తగ్గిన వడ్డీ రేట్లు ఆగస్టు 10 నుంచి అమలు

13:57 August 07

జీడీపీ వృద్ధి అంచనా తగ్గింపు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ అంచనాను 7 శాతం నుంచి 6.9 శాతానికి తగ్గించింది ఆర్బీఐ. రిజర్వు బ్యాంకు ద్రవ్య విధాన కమిటీ తాజా సమావేశంలో జీడీపీ అంచనాలను సవరించింది. అంతర్జాతీయ వాణిజ్య యుద్ధ భయాలు, ప్రపంచ వృద్ధి మందగిస్తుందన్న అంచనాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది.

"ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ భాగంలో జీడీపీ వృద్ధి రేటు 5.8 శాతం నుంచి 6.6 శాతం మధ్య నమోదు కావచ్చు. రెండో అర్ధ భాగంలో 7.3 శాతం నుంచి 7.5 శాతంగా ఉండే అవకాశం ఉంది."
                                                               -ఆర్బీఐ

ఇది కాలానుగుణంగా చేసే సవరణ మాత్రమేనని స్పష్టం చేసింది ఆర్పీఐ.

13:11 August 07

ఎంపీసీ సమావేశ ముఖ్యాంశాలు

  • రెపో రేటు 35 బేసిస్ పాయింట్ల తగ్గింపు.. 
  • తాజా సవరణతో 5.40 శాతంగా రెపో రేటు
  • రివర్స్ రెపో రేటు 5.15 శాతానికి తగ్గింపు
  • 5.65 శాతంగా మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్​ఎఫ్​) రేటు
  • ప్రస్తుతం ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటు 6.9 శాతానికి తగ్గింపు
  • 2019-20 రెండో అర్ధభాగానికి.. 3.5 శాతం నుంచి 3.7 శాతంగా ద్రవ్యోల్బణం అంచనా
  • ప్రైవేటు పెట్టబడులకు అధిక ప్రాధాన్యం
  • అక్టోబర్​ 4న తదుపరి ద్వైమాసిక ద్రవ్య విధాన సమీక్షా సమావేశం

12:30 August 07

ద్రవ్యోల్బణం అదుపులో ఉన్నందుకే వడ్డీ కోత

కీలక వడ్డీ రేట్లను సవరించింది రిజర్వు బ్యాంకు. అంచనాలకు మించి 35 బేసిస్ పాయింట్ల రెపో రేటు కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది. తాజా సవరణతో రెపో రేటు 5.40 శాతానికి చేరింది. రివర్స్​ రెపో రేటును 5.15 శాతంగా నిర్ణయించింది రిజర్వు బ్యాంకు.

ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతాదాస్​​ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ మూడు రోజుల సమావేశం అనంతరం ఈ కీలక ప్రకటన చేసింది.

ఆర్బీఐ అంచనాలకు తగ్గట్లుగానే ద్రవ్యోల్బణ ఉండటం, దేశ ఆర్థిక వృద్ధి మందగిస్తుందన్న అంచనాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిటీ వెల్లడించింది. ఆర్బీఐ రెపో రేటు తగ్గించడం ఈ ఏడాదిలో ఇది నాలుగో సారి.

వాణిజ్య యుద్ధం, ప్రపంచ వృద్ధి మందగమనం నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి దేశ జీడీపీ అంచనాను 7 శాతం నుంచి 6.9 శాతానికి తగ్గించింది ఆర్బీఐ.

వినియోగదారుల ధరల సూచీ ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో ఆర్ధ భాగంలో 3.5 శాతం నుంచి 3.7 శాతం మధ్య ఉండొచ్చని అంచనా వేసింది.

12:10 August 07

ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ నిర్ణయాలు

  • అంచనాలకు మించి.. 35 బేసిస్ పాయింట్ల రెపోరేటు కోత
  • తాజా సవరణతో 5.4 శాతానికి చేరిన రెపోరేటు
  • రివర్స్​ రెపో రేటు 5.15గా నిర్ణయించిన కమిటీ
  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ అంచనా 6.9 శాతానికి తగ్గింపు
     

11:53 August 07

రుణాలు మరింత చౌక

  • ఆర్‌బీఐ మూడో ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష
  • రెపో,రివర్స్‌ రెపో రేట్లను తగ్గించిన రిజర్వు బ్యాంకు
  • రెపో రేటు35బేసిస్‌ పాయింట్లు తగ్గించిన ఆర్‌బీఐ

11:43 August 07

రెపో ప్రకటన ముందు ఆచితూచి

స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 56 పాయింట్లు బలపడి 37,031 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది. నిఫ్టీ 6 పాయింట్ల స్వల్ప లాభంతో.. 10,954 వద్ద ట్రేడవుతోంది. ఆర్బీఐ రెపో ప్రకటన నేపథ్యంలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

ఎస్​ బ్యాంకు, ఇండస్​ఇండ్ బ్యాంకు, హీరో మోటార్స్​, హెచ్​యూఎల్​, హెచ్​సీఎల్​టెక్​ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

టాటా స్టీల్​, ఎం&ఎం, ఓఎన్​జీసీ, యాక్సిస్​ బ్యాంకు, మారుతీ, వేదాంత షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

11:06 August 07

ఒకే రోజు రూ.1,113 పెరిగిన బంగారం ధర

ఆర్బీఐ మూడు రోజుల ద్రవ్య పరపతి విధాన సమీక్షా(ఎంపీసీ) సమావేశం నేటితో ముగియనుంది. రిజర్వు బ్యాంకు గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ద్రవ్య విధాన కమిటీ మరికాసేపట్లో రెపో రేటును వెల్లడించనుంది.

ఆర్థిక వృద్ధి మందగమనం, ఆర్బీఐ అంచనాలకు లోబడే ద్రవ్యోల్బణం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సారీ 25 బేసిస్​ పాయింట్ల రెపో కోత ఉండొచ్చనే అంచనాలున్నాయి. ఆశించినట్లే కోత ఉంటే.. 2019-20లో రెపో తగ్గించడం వరుసగా ఇది ముడో సారి అవుతుంది. ఏప్రిల్​, జూన్ ద్వైమాసిక సమావేశాల్లో 25 బేసిస్ పాయింట్ల చొప్పున రెపో కోత విధించింది ఆర్బీఐ. ప్రస్తుతం రెపో రేటు 5.75 శాతంగా ఉంది.

రెపో రేటుతో పాటు వెలువడే కీలక అంశాలు..

నగదు నిల్వ నిష్పత్తి (సీఆర్​ఆర్​)ను 50 బేసిస్​ పాయింట్లు తగ్గించి.. రూ.60,000 కోట్ల నగదును వినియోగంలోకి తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తోంది ఆర్బీఐ. దీనిపైనా స్పష్టత రానుంది.

Last Updated : Aug 7, 2019, 4:00 PM IST

ABOUT THE AUTHOR

...view details