తెలంగాణ

telangana

రెపో రేటు తగ్గేనా?.. నేడే ఆర్బీఐ కీలక ప్రకటన

By

Published : Dec 5, 2019, 6:16 AM IST

ఈ ఏడాదికి చివరి ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు నేడు వెలువడనున్నాయి. వృద్ధి మందగమనం నేపథ్యంలో రెపో తగ్గింపు సహా.. పలు కీలక నిర్ణయాలు వెలువడే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

RBI
ఆర్బీఐ రెపో

రెపో రేటుపై రిజర్వు బ్యాంకు నేడు కీలక ప్రకటన చేయనుంది. మూడు రోజుల పాటు జరిగే.. ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష సమావేశం నేటితో ముగియనుంది. ఆర్థిక మాంద్యం పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఈ సారీ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆర్థిక వృద్ధి పుంజుకునే వరకు వడ్డీ రేట్లు తగ్గిస్తూనే ఉంటామని ఆర్బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్ గతంలో చెప్పడం ఇందుకు ఊతమిస్తోంది.

వడ్డీ రేటు తగ్గింపునకు కారణమయ్యే అంశాలు..

2019-2020 రెండో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు ఆరేళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోడవం వంటి కారణాలను పరిగణించి ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గిస్తుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

వీటికి తోడు అక్టోబర్​లో రిటైల్ ద్రవ్యోల్బణం భారీగా పెరగటం వంటి అంశాలను ఆర్బీఐ పరిశీలించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుత రెపో లెక్కలివి..

2019లో ఇప్పటి వరకు 5సార్లు వడ్డీరేట్లను సవరించారు. అర్బీఐ గవర్నర్​గా శక్తికాంత దాస్​ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వరుసగా రెపో రేటు తగ్గిస్తూ రావడం గమనార్హం. మొత్తం 135 బేసిస్‌ పాయింట్ల రెపో తగ్గించింది ఆర్బీఐ.

ప్రస్తుతం రెపో రేటు 5.15 శాతంగా ఉండగా.. రివర్స్ రెపో రేటు 4.90 శాతంగా ఉంది.

ఇదీ చూడండి:జియో కొత్త టారిఫ్​లు విడుదల​.. 39 శాతం పెరిగిన ధరలు

ABOUT THE AUTHOR

...view details