బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల(ఎన్బీఎఫ్సీ)పై ఫిర్యాదుల దాఖలుకు రిజర్వు బ్యాంకు తన వెబ్సైట్లో కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల పని తీరును మెరుగుపరిచేందుకు ఈ ఫిర్యాదుల నిర్వహణ వ్యవస్థ(సీఎమ్ఎస్)ను తీసుకొచ్చినట్లు ఆర్బీఐ పేర్కొంది.
దీని ద్వారా ఆర్బీఐ పరిధిలో ఉన్న అన్ని బ్యాంకులు, ఎన్బీఎఫ్సీపై ఫిర్యాదులు ఇచ్చేందుకు వీలు కల్పిస్తున్నట్లు తెలిపింది. సంబంధిత కార్యాలయాలు ఫిర్యాదులు స్వీకరించి.. సమస్యలను పరిష్కరిస్తాయని వెల్లడించింది.