ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ నోకియా అధ్యక్షుడు, సీఈఓ బాధ్యతల నుంచి భారతీయ వ్యాపారవేత్త రాజీవ్ సూరి తప్పుకోనున్నారు. ఆయన స్థానంలో పెక్కా లూండ్మార్క్ను నోకియా బోర్డ్ డైరెక్టర్లు నియమించారు. లూండ్మార్క్ ఈ ఏడాది సెప్టెంబర్ 1న బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని ఓ ప్రకటనలో పేర్కొంది నోకియా.
సీఈఓ, అధ్యక్ష పదవుల నుంచి భవిష్యత్తులో తప్పుకుంటానని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లకు తొలుత సూచించారు సూరి. ఈ నేపథ్యంలో సూరి వారసుడి కోసం ఆయనతో కలిసి విస్తృత చర్చలు సాగించారు డైరెక్టర్లు. ఈ ప్రక్రియ లూండ్మార్క్ ఎంపికతో పూర్తయిందని నోకియా వర్గాలు తెలిపాయి.
"2020 ఆగస్టు 31న ప్రస్తుత స్థానం నుంచి సూరి వైదొలుగుతారు. 2021 జనవరి 1 వరకు నోకియా బోర్డుకు సలహాదారుగా వ్యవహరిస్తారు."
- నోకియా ప్రకటన