ప్రపంచంలోని 100 మంది అగ్రశ్రేణి కుబేరుల్లో డీమార్ట్ అధినేత రాధాకిషన్ దమానీకి చోటు దక్కింది. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ సూచీలో ఆయనకు 98వ స్థానం లభించింది. దమానీ నికర సంపద 19.2 బిలియన్ డాలర్లు (సుమారు రూ.1,38,000 కోట్లు)గా నిర్ధరించారు.
100 మంది అగ్రశ్రేణి కుబేరుల్లో మన దేశం నుంచి ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ, అజీమ్ ప్రేమ్‌జీ, పల్లోంజీ మిస్త్రీ, శివ్ నాడార్, లక్ష్మీ మిత్తల్ ఉన్నారు.