తెలంగాణ

telangana

ETV Bharat / business

కొవిడ్-19 చికిత్సకు సొరియాసిస్​ ఔషధం

కరోనా వైరస్​ నుంచి బాధితులను రక్షించేందుకు వైద్యులు చేయని ప్రయత్నం లేదు. ఇందులో భాగంగానే సొరియాసిస్​ వ్యాధి నివారణకు ఉపయోగించే ఇటోలిజుమాబ్​ ఇంజెక్షన్​ను బాధితులకు పరిమితంగా వాడేందుకు డ్రగ్​ కంట్రోలర్​ జనరల్​ ఆఫ్​ ఇండియా (డీసీజీఐ) అనుమతించింది.

Psoriasis injection okayed for limited use to treat COVID patients: Drug controller
కొవిడ్-19 చికిత్సలో సొరియాసిస్​ ఔషధం

By

Published : Jul 11, 2020, 8:13 AM IST

సొరియాసిస్ వ్యాధి చికిత్సలో ఉపయోగించే ఇటోలిజుమాబ్‌ ఇంజెక్షన్‌ను కొవిడ్-19 బాధితులకు పరిమితంగా వాడేందుకు డ్రగ్​ కంట్రోలర్​ జనరల్​ ఆఫ్​ ఇండియా (డీసీజీఐ) అనుమతించింది. కరోనా బారిన పడి తీవ్రంగా లేదా మోస్తరుగా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారికి పరిమితంగా ఇటోలిజుమాబ్‌ను వినియోగించవచ్చని తెలిపింది.

క్లినికల్ ట్రయల్స్‌లో వైరస్ బాధితులపై ఇటోలిజుమాబ్ సంతృప్తికర స్థాయిలో ప్రభావం చూపిన నేపథ్యంలో పరిమితంగా వాడేందుకు వైద్య నిపుణుల కమిటీ పచ్చజెండా ఊపంది. సొరియాసిస్ వ్యాధి బాధితుల చికిత్స కోసం ఎప్పటి నుంచో ఈ ఔషధాన్ని వినియోగిస్తున్నారు.

ఇదీ చూడండి:'జీతాల చెల్లింపులకు భారతీయ సంస్థల కష్టాలు'

ABOUT THE AUTHOR

...view details