తెలంగాణ

telangana

ETV Bharat / business

ప్రీ పెయిడ్​.. పోస్ట్​ పెయిడ్​.. ఏ ప్లాన్​ ఉత్తమం..! - update on postpaid

ప్రస్తుత రోజుల్లో మొబైల్​ ఫోన్​ వాడనివారు చాలా అరుదుగా కనిపిస్తారు. ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్​ ఉండాల్సిందే.. అయితే మొబైల్​ కనెక్షన్​ తీసుకునేటప్పుడు.. ప్రీపెయిడ్​ తీసుకోవాలా, పోస్ట్​పెయిడ్​ తీసుకోవాలా అనే సందేహం ప్రతి ఒక్కరినీ తొలచివేస్తుంది. అంతర్జాలంపై ఎక్కువగా ఆధారపడేవారికి ఇది మరీ ముఖ్యం. ప్రీపెయిడ్​ ప్లాన్​, పోస్ట్​పెయిడ్​ ప్లాన్లలో ఏది ఉత్తమం.

ప్రీపెయిడ్​, పోస్ట్​పెయిడ్​ కనెక్షన్​

By

Published : Oct 29, 2019, 6:31 AM IST

Updated : Oct 29, 2019, 12:46 PM IST

భారత టెలికాం రంగంలోకి రిలయన్స్​ జియో అడుగుపెట్టాక ప్రీపెయిడ్​ పట్ల ప్రజల అభిప్రాయం మారిపోయింది. అంతకు ముందు ప్రీపెయిడ్​కు బదులుగా పోస్ట్​ పెయిడ్​వైపే ఎక్కువగా మొగ్గు చూపేవారు వినియోగదారులు. ప్రత్యేకంగా అంతర్జాల వినియోగదారులు అధికంగా పోస్ట్​ పెయిడ్​నే ఎంచుకునేవారు. కానీ ఈ ధోరణిని జియో మార్చేసింది. 1జీబీ డేటాను కేవలం రూ.10కే అందించింది. జియో, ఎయిర్​టెల్​, వొడాఫోన్​-ఐడియా​ నెట్​వర్క్​ల నుంచి అధికంగా ప్రీపెయిడ్​ కనెక్షన్లు తీసుకుంటున్నారు.

కానీ పోస్ట్​ పెయిడ్​ ప్లాన్లలో ఉచిత ఓటీటీ సర్వీసులు లభిస్తున్నాయి. రిలయన్స్​ జియో పోస్ట్​పెయిడ్​ సేవల్లో లేదు కానీ ఎయిర్​టెల్​, వొడాఫోన్​ ఐడియా ఈ సేవలను తక్కువ రేట్లకే అందిస్తున్నాయి. రూ. 499లకే అన్ని రకాల సేవలను ప్రకటిస్తున్నాయి. ఈ ప్లాన్లలోనే నెట్​ఫ్లిక్స్​, అమెజాన్​ ప్రైమ్​, జీ5 వంటివీ ఉచితంగా అందిస్తున్నాయి. గతంలోని పోస్ట్​పెయిడ్​ ప్లాన్ల కన్నా ప్రస్తుతం అదనపు లాభాలు ఉన్నాయి.

పోస్ట్​పెయిడ్​ ప్లాన్స్​..

ఎయిర్​టెల్​, వొడాఫోన్​ ఐడియాలు ఇంచుమించు ఒకే విధమైన పోస్ట్​ పెయిడ్​ ప్లాన్లను అందిస్తున్నాయి. రెండు టెలికాం సంస్థలు పోస్ట్​ పెయిడ్​ ప్లాన్లలోనే ఓటీటీ సబ్​స్క్రిప్షన్​ను అందిస్తున్నాయి. ఈ ప్లాన్ల ధర రూ.499 నుంచి ప్రారంభమవుతోంది.

ఎయిర్​టెల్​లో

నెల రోజులకు గాను రూ.499తో 75జీబీ డేటా, దేశవ్యాప్తంగా ఏ నెట్​వర్క్​కు​ అయినా అన్​లిమిటెడ్​ కాల్స్, రోజుకు 100 ఎస్​ఎంఎస్​లు, రూ.1500 విలువైన నెట్​ఫ్లిక్స్​ సబ్​స్క్రిప్షన్​, ఏడాది పాటు అమెజాన్​ ప్రైమ్​ సభ్యత్వం, ప్రతినెలా రూ.99 విలువైన జీ5 సబ్​స్క్రిప్షన్​. హ్యాండ్​ సెట్​ రక్షణ, 500 జీబీ వరకు డేటా రోల్​ఓవర్​ సౌకర్యం ఉంది.

ఒకవేళ వినియోగదారుడు రూ.749, రూ.999, రూ.1,599 విలువైన ప్యాకేజీలను తీసుకున్నట్లయితే మరింత అదనపు లాభం పొందేలా ప్లాన్లు ఉన్నాయి. ఎయిర్​టెల్​లో రూ.299 ప్రీపెయిడ్​ ప్లాన్​ అమెజాన్​ ప్రైమ్​ సబ్​స్క్రిప్షన్​ను అందిస్తున్నప్పటికీ.. అది రూ.499 పోస్ట్​పెయిడ్​ ప్లాన్​ను అధిగమించే పరిస్థితి లేదు.

వొడాపోన్- ఐడియాలో...

వొడాఫోన్​ ఐడియాలో రూ.499తో పోస్ట్​ పెయిడ్​ ప్లాన్​ అందిస్తోంది. ఇందులో 75జీబీ డేటాతో పాటు 200జీబీ డేటా రోల్​ఓవర్​ సౌకర్యం, అన్​లిమిటెడ్​ వాయిస్​ కాలింగ్​, ఏడాది పాటు అమెజాన్​ ప్రైమ్​ సబ్​స్క్రిప్షన్​, ఉచితంగా జీ5 ప్రీమియం అందిస్తోంది. రూ.649, రూ.999, రూ.1,299 వంటి ప్లాన్లలో మరిన్ని సేవలు ఉచితంగా పొందే వీలుంది. కుటుంబం కోసం ప్రత్యేక పోస్ట్​ పెయిడ్​ ప్లాన్లు అందిస్తోంది.

ప్రీపెయిడ్​ ప్లాన్స్​తో ఉపయోగమేంటీ..?

పోస్ట్​పెయిడ్​ ధరతోనే ప్రీపెయిడ్​ ప్లాన్లు మంచి ప్రామాణికతను అందిస్తున్నాయి. ఎయిర్​టెల్​ 82 రోజుల వ్యవధితో రూ. 499కి రోజుకు 2జీబీ డేటా, అన్​లిమిటెడ్​ కాలింగ్​, రోజుకు 100 ఎస్​ఎంఎస్​లు అందిస్తోంది. పోస్ట్​పెయిడ్​లో ఓటీటీ సబ్​స్క్రిప్షన్​, అమెజాన్​ ప్రైమ్​ వంటి వాటిని మినహాయిస్తే ప్రీ పెయిడ్​ ప్లాన్లలో వినియోగదారులకు మంచి ప్రామాణికతను అందిస్తోంది.

రెండింట్లో ఏది ఉత్తమం...?

ప్రీపెయిడ్​.. పోస్ట్​ పెయిడ్... రెండింట్లో ఏది​ ఉత్తమం అనేది సగటు వినియోగదారుడి మదిలో మెదిలే ప్రశ్న. రూ.499 విలువైన ప్లాన్లను పరిశీలిస్తే.. ఏడాది కాలానికి (పన్నులు మినహాయించి) పోస్ట్​పెయిడ్​ ఛార్జీలు రూ.5,988కి చేరుతాయి. అదే సమయానికి ప్రీపెయిడ్​ ఛార్జీలు కేవలం రూ.1,996 (328 రోజులకు) అవుతాయి. ఒక నెల రీఛార్జ్​ ప్లాన్​ రూ.249తో ఏడాదికి కేవలం రూ.2,245 అవుతుంది. ప్రీపెయిడ్​ ప్లాన్ల ద్వారా వినియోగదారులు చాలా వరకు ఆదా చేస్తారు. కానీ ఇప్పుడు ఓటీటీ సబ్​స్క్రిప్షన్​ ఛార్జీలను లెక్కించాల్సి ఉంది.

అమెజాన్​ ప్రైమ్​ ఏడాది చందా ధర రూ.999, 3 నెలల నెట్​ఫ్లిక్స్​ చందా రూ.1,500, ప్రతి నెల జీ5 ప్రీమియం చందా రూ.99 విలువైనవి పోస్ట్​పెయిడ్​ వినియోగదారులకు ఉచితంగా అందుతున్నాయి. ఇవన్నీ కేవలం ఎయిర్​టెల్​ పోస్ట్​పెయిడ్​ ప్లాన్​ రూ.499తో లభిస్తాయి. వొడాఫోన్ ​ఐడియాలో రూ.999కన్నా తక్కువ ప్లాన్లలో ఈ సౌకర్యాలు అందుబాటులో లేవు.

ప్రీపెయిడ్​ చందాదారులు ఓటీటీ సేవలకు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. కానీ పోస్ట్​పెయిడ్​ కస్టమర్లకు ఇవి ఉచితంగా అందుతున్నాయి. పోస్ట్​పెయిడ్​లో ఆడ్​-ఆన్​ కనెక్షన్​ సేవలు అందిస్తోంది. దీని ద్వారా అదనంగా ఆదా చేసే అవకాశం ఉంది. దీనితో పాటు డేటా రోల్​ఓవర్​ సౌకర్యమూ ఉంది. నెట్​ఫ్లిక్స్​, అమెజాన్​ ప్రైమ్​, జీ5లను పట్టించుకోని వారైతే.. ప్రీపెయిడ్​ ప్లాన్లు మీకు ఉత్తమం.

ఇదీ చూడండి: 5 కెమెరాలతో షియోమీ నుంచి సూపర్ బడ్జెట్​ ఫోన్​!

Last Updated : Oct 29, 2019, 12:46 PM IST

ABOUT THE AUTHOR

...view details