తెలంగాణ

telangana

ETV Bharat / business

పీఎంసీ కేసులో కేంద్రం, ఆర్బీఐకి కోర్టు నోటీసులు - పీఎంసీ బ్యాంకు కుభకోణం

పీఎంసీ బ్యాంకు కుంభకోణంపై విచారణ చేపట్టింది దిల్లీ హైకోర్టు. డిపాజిటర్ల నగదు ఉపసంహరణపై ఆంక్షలు ఎత్తివేయాలన్న ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని ధర్మాసనం నేడు పరిశీలించింది. కేంద్రం, దిల్లీ సర్కారు​, ఆర్బీఐ పిల్​పై స్పందించాలని నోటీసులు జారీ చేసింది.

పీఎంసీ కేసులో కేంద్రం, ఆర్బీఐకి కోర్టు నోటీసులు

By

Published : Nov 1, 2019, 1:09 PM IST

పంజాబ్​ మహారాష్ట్ర కోఆపరేటివ్​ బ్యాంకు (పీఎంసీ) కేసును దిల్లీ హైకోర్టు నేడు విచారించింది. నగదు ఉపసంహరణపై విధించిన ఆంక్షలు ఎత్తివేయాలని దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని పరిశీలించింది ధర్మాసనం. పిటిషన్​పై కేంద్రం, దిల్లీ​ సర్కారు, ఆర్బీఐ తమ స్పందన తెలపాలని ఆదేశించింది.

ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ డి.ఎన్​.పటేల్​, జస్టిస్​ సి.హరి శంకర్​తో కూడిన ధర్మాసనం... ఆర్థిక మంత్రిత్వ శాఖ, దిల్లీ ప్రభుత్వం, ఆర్బీఐ, పీఎంసీ బ్యాంకులకు నోటీసు జారీ చేసింది. పీఎంసీ బ్యాంకు డిపాజిటర్లకు 100 శాతం బీమా ఇవ్వాలన్న వాదనపైనా తమ అభిప్రాయం తెలపాలని కోర్టు నోటీసుల్లో పేర్కొంది.

పీఎంసీ బ్యాంకు రూ.4,355 కోట్ల కుంభకోణంలో చిక్కుకున్నట్లు ఇటీవల బయటపడింది. ఈ నేపథ్యంలో పీఎంసీ బ్యాంకు ఖాతాదారుల నగదు ఉపసంహరణపై బ్యాంకింగ్​ నియంత్రణ సంస్థ ఆర్బీఐ ఆంక్షలు విధించింది. ఆరు నెలల్లో రూ.40,000 మాత్రమే ఉపసంహరించుకోవాలనే ఆంక్షలతో పీఎంసీ ఖాతాదారుల్లో భయాలు నెలకొన్నాయి.

ఇదీ చూడండి: మొదటిసారిగా 108 ఎమ్​పీ​ కెమెరాతో.. షియోమీ నోట్​ 10!

ABOUT THE AUTHOR

...view details