తెలంగాణ

telangana

By

Published : Nov 10, 2020, 1:43 PM IST

ETV Bharat / business

వ్యాక్సిన్ జోష్​తో ఫైజర్ షేర్​ 20% జంప్

దేశీయ స్టాక్ మార్కెట్లలో ఔషధ సంస్థ ఫైజర్ లిమిటెట్​ షేర్లు ఇంట్రాడేలో దాదాపు 20 శాతం పుంజుకున్నాయి. కంపెనీ కరోనా టీకా మెరుగైన ఫలితాలు ఇస్తున్నట్లు చేసిన ప్రకటనతో ఈ స్థాయి లాభాలను నమోదు చేశాయి.

Pfizer shares zoom Indian Exchanges
ఫైజర్ షేర్లకు వ్యాక్సిన్ జోష్​

ప్రముఖ ఔషధ తయారీ సంస్థ ఫైజర్ షేర్లు దేశీయ మార్కెట్లో భారీగా పుంజుకుని 52 వారాల గరిష్ఠ స్థాయిని నమోదు చేశాయి. తాము ఉత్పత్తి చేసిన కొవిడ్ వ్యాక్సిన్​.. మనుషులపై చేసిన మూడో దశ పరీక్షల్లో 90 శాతం మెరుగైన ఫలితాలు ఇచ్చినట్లు సోమవారం చేసిన ప్రకటన ఇందుకు కారణమైంది.

బీఎస్​ఈఎలో ఫైజర్ షేరు ఇంట్రాడేలో 16.29 శాతం పెరిగి.. షేరు విలువ రూ.5,875 వద్దకు చేరింది.

ఎన్​ఎస్​ఈలో ఫైజర్ షేరు ఏకంగా ఇంట్రాడేలో 19.83 శాతం వృద్ధితో.. విలువ పరంగా రూ.5,900 మార్క్​ను తాకింది.

ఇవీ చూడండి:ఫైజర్​ 'కరోనా వ్యాక్సిన్'​ 90శాతం ప్రభావవంతం!

ABOUT THE AUTHOR

...view details