తెలంగాణ

telangana

ETV Bharat / business

పెట్రో​ సెగ: 6 రోజుల్లో ధర ఎంత పెరిగిందో తెలుసా? - డ్రోన్ దాడి

దేశంలో పెట్రోల్​, డీజిల్ ధరలు మళ్లీ కొండెక్కుతున్నాయి. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంతగా... కేవలం ఆరు రోజుల్లోనే లీటర్ పెట్రోల్ ధర రూ.1.59 పెరిగింది. లీటర్ డీజిల్ ధర రూ.1.31 ఎగిసింది. ఆరాంకో చమురు శుద్ధి కేంద్రంపై డ్రోన్​ దాడి నేపథ్యంలో అంతర్జాతీయ చమురు మార్కెట్​లో నెలకొన్న అనిశ్చితులే ఇందుకు ప్రధాన కారణం.

పెట్రోల్

By

Published : Sep 22, 2019, 12:52 PM IST

Updated : Oct 1, 2019, 1:45 PM IST

అంతర్జాతీయంగా చమురు సంక్షోభంతో దేశీయంగా పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి. రోజు వారీ ధరల సవరణ ప్రకారం సెప్టెంబర్​ 17 నుంచి ఆరు రోజుల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.1.59 పెరిగింది. డీజిల్ ధర లీటర్​కు రూ.1.31 ఎగబాకింది.

ఆదివారం ఒక్క రోజే దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర 27 పైసలు పెరిగి.. రూ.73.62కు చేరింది. డీజిల్ లీటర్​కు 18 పైసలు ఎగిసి రూ.66.74కు చేరింది.
దేశంలో పెట్రోల్, డీజిల్​ ధరలను రోజువారీ ప్రతిపాదికన సవరించే విధానాన్ని 2017లో ప్రారంభించింది ప్రభుత్వం. అప్పటి నుంచి ఈ స్థాయిలో ధరలు వరుసగా పెరగటం ఇదే ప్రథమం.

ప్రపంచంలో అతిపెద్ద చమురు ఉత్పత్తిదారు అయిన ఆరాంకో చమురు శుద్ధి కేంద్రంపై డ్రోన్ దాడి తర్వాత అంతర్జాతీయంగా చమురు సంక్షోభం మొదలైంది. సెప్టెంబర్​ 16న హౌతీ తిరుగుబాటుదార్లు చేసిన ఈ దాడితో ప్రపంచ చమురు ఉత్పత్తిలో 5 శాతం తగ్గిపోయింది. అప్పటినుంచి ముడి చమురు ధరలు వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. నెలాఖరు లోగా తగ్గిన ఉత్పత్తిని తిరిగి పునరుద్ధరిస్తామని.. ఆరాంకో ప్రతినిధులు అంటున్నా.. చమురు అనిశ్చితులు కొనసాగుతున్నాయి.

భారత్​పై ప్రభావమెంతంటే..

భారత్​కు.. సౌదీ రెండో అతిపెద్ద చమురు సరఫరాదారుగా ఉంది. సౌదీ నుంచి ప్రతి నెల 2 మిలియన్ టన్నుల ముడి చమురును భారత్ దిగుమతి చేసుకుంటోంది. సెప్టెంబర్​ నెలకు.. 1.2 నుంచి 1.3 మిలియన్ టన్నుల ముడి చమురును ఇప్పటికే భారత్​ దిగుమతి చేసుకుంది. మిగతా మొత్తాన్ని సరఫరా చేసేందుకు భారత్​కు సౌదీ హామీ ఇచ్చింది.

ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరుకు భారత్ 207.3 మిలియన్​ టన్నుల ముడి చమురు దిమగుతి చేసుకుంది. అందులో 40.33 మిలియన్​ టన్నులు సౌదీ నుంచే దిగుమతి కావడం గమనార్హం.

ఎల్​పీజీ విషయానికొస్తే.. ప్రతి నెల 2 లక్షల టన్నుల ఎల్​పీజీని సౌదీ నుంచి భారత్​ దిగుమతి చేసుకుంటోంది.

ఇదీ చూడండి: మోదీ పర్యటనపై.. అమెరికా కార్పొరేట్ల భారీ ఆశలు

Last Updated : Oct 1, 2019, 1:45 PM IST

ABOUT THE AUTHOR

...view details