తెలంగాణ

telangana

ETV Bharat / business

పతంజలి బాండ్ల ఇష్యూ 3 నిమిషాల్లోనే పూర్తి - ఎన్​సీడీ బాండ్లు అంటే

పతంజలి ఆయుర్వేద్​ ఎన్​సీడీ ఇష్యూకు భారీ స్పందన లభించింది. రూ.250 కోట్ల నిధుల సమీకరణకు గురువారం ఇష్యూ ప్రారంభించగా.. నిమిషాల్లోనే 100 శాతం సబ్​స్క్రైబ్​ను సాధించింది.

huge response to Patanjali bonds
పతంజలి బాండ్లకు భారీ స్పందన

By

Published : May 29, 2020, 8:44 AM IST

పతంజలి ఆయుర్వేద్ రూ.250 కోట్ల సమీకరణకు చేపట్టిన బాండ్ల ఇష్యూకు విశేష స్పందన లభించింది. గురువారం ఇష్యూ ప్రారంభమవగా.. కేవలం మూడు నిమిషాల్లోనే పూర్తిగా సబ్​స్క్రైబ్ అయ్యింది. ఇష్యూకు వచ్చిన భారీ స్పందనపై పతంజలి ఆయుర్వేద్ హర్షం వ్యక్తం చేసింది.

"మా తొలి రూ.250 కోట్ల ఎన్​సీడీ ఇష్యూకు 3 నిమిషాల్లోనే 100 శాతం స్పందన రావడం చరిత్రాత్మకం. మాపై మదుపర్లకు ఉన్న నమ్మకానికి, ఆసక్తికి ఇదే నిదర్శనం. భారత్​లో అత్యంత విశ్వసనీయ బ్రాండ్​గా ఈ ఇష్యూ నిలిపింది"

- ఆచార్య బాలకృష్ణ, పతంజలి ఆయుర్వేద్ మేనేజింగ్ డైరెక్టర్

ఈ ఎన్​సీడీలకు కాలపరిమితి మూడేళ్లుగా ఉండగా.. కూపన్​ రేటు 10.10 శాతం. ఈ బాండ్లకు 2023 మే 28తో గడువు ముగుస్తుంది. ఇవి ఎక్సేంజీలోనూ నమోదవుతాయి.

ఇదీ చూడండి:'జియో'లో మరో కంపెనీ పెట్టుబడి పెట్టనుందా?

ABOUT THE AUTHOR

...view details