కరోనా మహమ్మారి కారణంగా దేశీయంగా దిగ్గజ సంస్థలే కుదేలయల్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో అంకురాల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఇదే విషయమై ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఫిక్కీ), ఇండియన్ ఏంజెల్ నెట్వర్క్(ఐఏఎన్)లు సంయుక్తంగా ఓ సర్వే నిర్వహించాయి. ఇందులో అంకురాలపై కరోనా, లాక్డౌన్ల ప్రభావం గురించి పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి.
కరోనాతో 70 శాతం అంకురాలు కుదేలు! - కరోనా కాలంలో అంకురాల పరిస్థితి
కరోనా సంక్షోభంతో దేశవ్యాప్తంగా అంకుర సంస్థలు తీవ్రంగా కుదేలయ్యాయి. ముఖ్యంగా నిధుల కొరత, వ్యాపార కార్యకలాపాల్లో క్షీణత వంటి గడ్డు పరిస్థితులు ఏర్పడాయి. కరోనా సంక్షోభం అంకుర సంస్థలపై ఎంతలా పడింది అనే అంశంపై ఓ సర్వే వెల్లడించిన విషయాలు ఇలా ఉన్నాయి.
అంకురాలపై కరోనా ప్రభావం
సర్వేలోని ముఖ్యంశాలు..
- సర్వేలో దేశవ్యాప్తంగా మొత్తం 250 అంకుర సంస్థలు పాల్గొన్నాయి. అందులో 70 శాతం కరోనా వల్ల తమ వ్యాపారాలు ప్రభావితమైనట్లు వెల్లడించాయి.
- 12 శాతం అంకురాలు ఇప్పటికే కార్యకలాపాలను నిలిపేసినట్లు తెలిపాయి.
- లాక్‌డౌన్‌ను ఇంకా పొడగిస్తే.. తాము ఉద్యోగాల కోత విధించక తప్పదని 30 శాతం అంకురాలు తెలిపాయి.
- 43 శాతం స్టార్టప్‌లు ఏప్రిల్ నుంచి జూన్ మధ్య ఉద్యోగుల వేతనాల్లో 20-40 శాతం కోతలు విధించినట్లు తెలిపాయి.
- పెట్టుబడుల విషయాన్ని తమ ఇన్వెస్టర్లు ప్రస్తుతానికి పక్కన పెట్టినట్లు 33 శాతం అంకుర సంస్థలు తెలిపాయి. మరో 10 శాతం స్టార్టప్‌లు తమ ఒప్పందాలు నిలిచిపోయినట్లు వెల్లడించాయి.
- 8 శాతం అంకురాలు మాత్రమే..లాక్‌డౌన్‌కు ముందు కుదిరిన ఒప్పందాల ప్రకారం తమకు నిధులు అందినట్లు తెలిపాయి.
- నిధుల కొరత వల్ల వ్యాపార అభివృద్ధి, తయారీ కార్యకలాపాలు పూర్తిగా నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు స్టార్టప్‌లు ఆందోళన వ్యక్తం చేశాయి.
- సర్వేలో పాల్గొన్న ఇన్వెస్టర్లలో 96 శాతం మంది తమ పెట్టుబడులు కరోనా వల్ల తగ్గించినట్లు అంగీకరించారు. 92 శాతం మంది రానున్న ఆరు నెలల వరకు పెట్టుబడులు వృద్ధి చెందకపోవచ్చని చెప్పుకొచ్చారు.
- ఇలాంటి పరిస్థితుల్లో స్టార్టప్‌లు తిరిగి పుంజుకోవాలంటే ప్రభుత్వం నుంచి అత్యవసర ఉపశమన ప్యాకేజీ అవసరమని సర్వే అభిప్రాయపడింది.
ఇదీ చూడండి:వైరస్‌ను కడిగే ఫోన్ సోప్ గురించి తెలుసా?