తెలంగాణ

telangana

ETV Bharat / business

బ్యాంకులపై అపోహలు వద్దు.. ఆర్బీఐ హామీ! - భారత బ్యాంకులు

బ్యాంకింగ్ వ్యవస్థపై వస్తున్న వదంతులు నమ్మొద్దని రిజర్వు బ్యాంకు కోరింది. పంజాబ్​ అండ్​ మహారాష్ట్ర కో-ఆపరేటివ్​ బ్యాంకు సంక్షోభంతో నెలకొన్న అపోహలను తొలగించేందుకు ఆర్బీఐ ఈ ప్రకటన చేసింది.

బ్యాంకులపై అపోహలు వద్దు.. ఆర్బీఐ హామీ!

By

Published : Oct 1, 2019, 8:06 PM IST

Updated : Oct 2, 2019, 7:16 PM IST

భారత బ్యాంకింగ్​ వ్యవస్థ దృఢంగా ఉన్నట్లు రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) మరో సారి స్పష్టం చేసింది. బ్యాంకులు సంక్షోభంలో ఉన్నట్లు వస్తున్న వార్తలపై ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని భరోసా ఇచ్చింది.

పంజాబ్​ అండ్​ మహారాష్ట్ర కో-ఆపరేటివ్​ బ్యాంకు సంక్షోభం కారణంగా.. దేశంలోని ఇతర బ్యాంకుల పరిస్థితిపై వదంతులు వ్యాపించాయి. ఫలితంగా నిఫ్టీ బ్యాంక్​ 1.30 శాతం నష్టపోయింది. ఈ పరిణామాలన్నింటి దృష్ట్యా ఆర్బీఐ తాజా ప్రకటన చేసింది.

ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న అనిశ్చితుల నేపథ్యంలో సెన్సెక్స్​, నిఫ్టీలో బ్యాంకింగ్ రంగ షేర్లు కుదేలయ్యాయి.
ముఖ్యంగా ఎస్​ బ్యాంకు, ఆర్​బీఎల్​ బ్యాంకు, ఇండస్​ఇండ్​ బ్యాంకు, ఎస్​బీఐ, ఐడీఎఫ్​సీ ఫస్ట్, పంజాబ్​ నేషనల్ బ్యాంకులు భారీ నష్టాలను నమోదు చేశాయి.

ఇదీ చూడండి: భారత్​కు శాంసంగ్ మడత ఫోన్- ధరెంతో తెలిస్తే షాక్​!

Last Updated : Oct 2, 2019, 7:16 PM IST

ABOUT THE AUTHOR

...view details