తెలంగాణ

telangana

ETV Bharat / business

జులై 25 వరకు రిమాండ్​లోనే నీరవ్​మోదీ

లండన్​లో జైలు జీవితం గడుపుతున్న వజ్రాల వ్యాపారి నీరవ్​మోదీ రిమాండ్​ను పొడిగించింది వెస్ట్​మినిస్టర్​ మెజిస్ట్రేట్స్​ కోర్టు. రుణఎగవేత, మనీలాండరింగ్​ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్​ నేడు వీడియోలింక్​ ద్వారా కోర్టు విచారణకు హాజరయ్యారు.

By

Published : Jun 27, 2019, 5:32 PM IST

జులై 25 వరకు రిమాండ్​లోనే నీరవ్​మోదీ

పంజాబ్​ నేషనల్​ బ్యాంకు కుంభకోణం ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్​మోదీ జులై 25న మరోసారి విచారణకు హాజరుకానున్నారు. లండన్​లోని వెస్ట్​మినిస్టర్​ మేజిస్ట్రేట్స్​ న్యాయస్థానం ఎదుట నేడు వీడియోలింక్​ ద్వారా విచారణకు హాజరయ్యారు నీరవ్​. ఆయన రిమాండ్​ను పొడిగిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. మళ్లీ విచారణ జరిగేవరకు ఆయన రిమాండ్​లోనే ఉండనున్నారు.

కేసు దస్త్రాలు పరిశీలించేందుకు.. అనుమతించాలన్న నీరవ్​ విజ్ఞప్తిని న్యాయస్థానం అంగీకరించింది. అయితే.. దాదాపు 5000 పేజీల మేర ఉన్న కేసు సంబంధిత దస్త్రాలను చూసేందుకు ల్యాప్​టాప్​నూ అనుమతించాలని కోరారు నీరవ్​ న్యాయవాదులు. దీనిపై కోర్టు స్పందించలేదు.

రుణ ఎగవేత, మనీలాండరింగ్​ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్​ను స్వదేశానికి రప్పించాలని ప్రయత్నాలు చేస్తోంది భారత్​.

నీరవ్​ మోదీని అప్పగించాలని భారత్​​ చేసిన విజ్ఞప్తి మేరకు లండన్​ కోర్టు ఆయనపై ఆరెస్టు వారెంటు జారీ చేసింది. మార్చి 19న స్కాట్​లాండ్ యార్డ్​​ అధికారులు నీరవ్​ను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటివరకు నీరవ్​ 4 సార్లు బెయిల్​కు యత్నించగా.. ప్రతిసారీ కోర్టులో చుక్కెదురైంది.

ABOUT THE AUTHOR

...view details