తెలంగాణ

telangana

ETV Bharat / business

ఈ కొత్త కార్డులను తీసుకున్నారా..? - స్వైపింగ్​

పాత మ్యాగ్నెటిక్​ స్ట్రిప్​ కార్డులు పనిచేయడం మానేశాయి. వాటి స్థానంలో కొత్తగా చిప్​ ఉన్న క్రెడిట్​, డెబిట్​ కార్డుల్ని ఇప్పటికే వినియోగదారులకు అందించాయి బ్యాంకులు. అయితే.. వాటిల్లోనూ కొత్తగా నియర్​ ఫీల్డ్​ కమ్యూనికేషన్​(ఎన్​ఎఫ్​సీ) కార్డులు వినియోగంలోకి వచ్చాయి. మీరు వీటిని తీసుకున్నారా..?

కొత్త కార్డులను తీసుకున్నారా..?

By

Published : Jun 26, 2019, 5:13 PM IST

చిప్​లతో కూడిన క్రెడిట్​, డెబిట్​ కార్డులను.. జారీ చేసిన బ్యాంకులు మరో కొత్త రకం కార్డులను తీసుకొచ్చాయని మీకు తెలుసా..? నియర్​ ఫీల్డ్​ కమ్యూనికేషన్​(ఎన్​ఎఫ్​సీ) పేరుతో వీటిని అందుబాటులోకి తెచ్చాయి.

స్వైప్​ లేకుండానే...

ఇప్పటివరకూ.. ఏదైనా కొన్న తర్వాత పీఓఎస్‌ యంత్రంలో కార్డును స్వైప్‌ చేసి, పిన్‌ను నమోదు చేస్తే ఆ లావాదేవీ పూర్తయినట్లే.

దీనికి భిన్నంగా స్వైపింగ్​, పిన్‌ నమోదు చేయాల్సిన అవసరం లేకుండానే కార్డును అలా పైన తాకిస్తే చాలు. వెంటనే చెల్లింపు పూర్తవుతుంది. ప్రస్తుతానికి ఈ కార్డును రూ.2,000 విలువ వరకూ అనుమతిస్తున్నారు. అంతకుమించి చెల్లింపులకు పిన్​ నమోదు తప్పనిసరి.

ఇది చాలా సులభం...

సాధారణ వాటితో పోలిస్తే ఈ ఎన్​ఎఫ్​సీ కార్డులు అత్యంత సురక్షితం. స్వైప్‌ చేయాల్సిన, పిన్‌ను పేర్కొనాల్సిన అవసరం ఉండదు. కాబట్టి, కీలకమైన సమాచారం బయటకు వెళ్తుందనే భయం ఉండదు. ఇంకా కార్డు ఎవరికీ ఇవ్వాల్సిన అవసరం కానీ ఉండదు. మీ కార్డు మీ చేతుల్లోనే ఉంటుంది. 4 సెంటీమీటర్ల దూరం నుంచే కార్డును గుర్తించి..లావాదేవీని పీఓఎస్‌ యంత్రం పూర్తి చేస్తుంది.

సాధారణంగా స్వైపింగ్​, పిన్​ నమోదు చేస్తే... ఒక కార్డు లావాదేవీకి 30 సెకండ్ల వరకూ సమయం పడుతుంది. కానీ.. ఎన్​ఎఫ్​సీ కార్డు ద్వారా కేవలం 3 సెకండ్లలోనే లావాదేవీని పూర్తి చేయొచ్చు. బిల్లు చెల్లింపు కోసం ఖాతాదారులు అధికంగా ఉన్నప్పుడు.. వ్యాపారులు, వినియోగదారులకూ ఈ కార్డుతో ఎంతో సమయం కలిసొస్తుంది.

ఎలా తీసుకోవాలి?

ఇటీవల చాలా బ్యాంకులు .. ఖాతాదారులకు కొత్త కార్డులను జారీ చేస్తున్నాయి. అందులో ఎక్కువగా ఈ ఎన్‌ఎఫ్‌సీ కార్డులే ఉంటున్నాయి. మీకు వచ్చిన కార్డు అలాంటిదో కాదో చూసుకోండి. దీనికోసం కార్డుపై ‘'వై-ఫై' ని పోలిన ఓ గుర్తు ఉంటుంది. ఒకవేళ లేకపోతే.. అలాంటి కార్డు కావాలని బ్యాంకును సంప్రదించండి.

ABOUT THE AUTHOR

...view details