తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆర్థిక వృద్ధి చర్యలపై ప్రధాని సమాలోచనలు - నిర్మలా సీతారామన్

వృద్ధి మందగమనం నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక స్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు. వృద్ధికి ఊతమందించే చర్యలపై అధికారులతో మోదీ చర్చించారు.

ఆర్థిక సమీక్ష

By

Published : Aug 15, 2019, 8:50 PM IST

Updated : Sep 27, 2019, 3:16 AM IST

దేశప్రస్తుతఆర్థిక వ్యవస్థపై ప్రధాని నరేంద్రమోదీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​తో సమగ్ర సమీక్ష నిర్వహించారు. వృద్ధివేగంగామందగమనానికిలోనై.. ఉద్యోగాల కోత, సంపద ఆవిరికి కారణమవుతున్న రంగాలను గాడిలో పెట్టేందుకు అవసరమైన పరిష్కారాల గురించి సమాలోచనలు చేశారు.

వరుసగా ఆరో ఏడాది ఎర్రకోటలో జాతినుద్దేశించి ప్రసంగించిన తర్వాత.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ సహా ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో మోదీ సమావేశమయ్యారు.

ముఖ్యంగా వృద్ధి మందగమనం, ధీర్ఘకాలంలో వాటి ప్రభావాలపై చర్చించినట్లు ఓ అధికారి తెలిపారు. త్వరలోనే రంగాల వారీగా ఉద్దీపన పథకాలతో ప్రభుత్వం ముందుకు వచ్చే అవకాశాలున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో చర్చించిన ఇతర అంశాలు వెల్లడించేందుకు నిరాకరించారు అధికారి.

ఇదీ చూడండి: ఇంద్రధనుస్సు తలపాగాతో మెరిసిన మోదీ

Last Updated : Sep 27, 2019, 3:16 AM IST

ABOUT THE AUTHOR

...view details