తెలంగాణ

telangana

ETV Bharat / business

నేటి అర్ధరాత్రి నుంచే 'మొబైల్​ ఛార్జీ'ల మోత - Voda Idea to raise mobile call, data charges from Dec 3 by up to 50%

భారత్‌లో వాయిస్‌, డేటా ఛార్జీలు ప్రియం కానున్నాయి. ప్రముఖ టెలికాం సంస్థలు వొడాఫోన్​ ఐడియా, రిలయన్స్​ జియో, భారతీ ఎయిర్​టెల్​.. ప్రీపెయిడ్‌ వినియోగదారులకు మొబైల్‌ కాల్స్​, ఇంటర్​నెట్​ ఛార్జీలను పెంచుతూ వేర్వేరుగా ప్రకటించాయి. పెరిగిన ధరలు డిసెంబర్‌ 3 నుంచి అమల్లోకి వస్తాయని వొడాఫోన్‌ ఐడియా, ఎయిర్‌టెల్‌ వెల్లడించగా, డిసెంబర్‌ 6 నుంచి నూతన ధరలు అందుబాటులోకి వస్తాయని జియో తెలిపింది. నెలకు కనీసం రూ. 49తో రీఛార్జీ చేయిస్తేనే ఇకపై చందాదార్లు ఇన్​కమింగ్​ కాల్స్​ అందుకోగలుగుతారని ఆయా కంపెనీలు స్పష్టం చేశాయి.

mobile-call-internet-to-become-costlier-by-up-to-50-pc-from-dec-3
మళ్లీ మొబైల్​ ఛార్జీల మోత.. అర్ధరాత్రి నుంచే అమల్లోకి

By

Published : Dec 2, 2019, 5:18 AM IST

ఇకపై భారత్‌లో మొబైల్‌ కాల్స్​, డేటా ఛార్జీలు పెరగనున్నాయి. ఈ మేరకు ప్రముఖ టెలికాం కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ప్రీపెయిడ్‌ వినియోగదారులకు ఈ సేవలపై 50 శాతం వరకు పెంచుతూ వొడాఫోన్‌ ఐడియా తొలుత ప్రకటించింది. ఆ వెంటనే ఎయిర్‌టెల్‌ కూడా 50 శాతం వరకు పెంచుతూ ప్రకటన జారీ చేసింది. ఎయిర్‌టెల్‌ ప్రకటించిన కాసేపటికే జియో కూడా తన టారిఫ్‌ ధరలను 40 శాతం వరకు పెంచింది.

గత కొన్నేళ్లుగా టెలికాం కంపెనీల మధ్య టారిఫ్​ యుద్ధం నడుస్తోంది. 2014లో రూ. 269/జీబీగా ఉన్న డేటా ఛార్జీలు రిలయన్స్​ జియో రాకతో ఇప్పుడు రూ.11.78కి పడిపోయాయి. అంటే దాదాపు 95 శాతం ధరలు తగ్గాయి. వాయిస్​ కాల్స్​ దాదాపు ఉచితంగా అందుబాటులోకి వచ్చాయి. టెలికాం రంగంలో తమ మనుగడ సాగించడానికి వొడాఫోన్​ ఐడియా విలీనమై.. జియో ప్లాన్లనే అనుసరించింది. అప్పటివరకు నెం.1గా ఉన్న ఎయిర్​టెల్ కూడా భారీ తగ్గింపులతో టారిఫ్​లలో కొత్త ప్లాన్లను తీసుకొచ్చింది. అయితే.. ఇదిప్పుడు గతం.

దాదాపు ఐదేళ్ల తర్వాత.. ప్రముఖ టెలికాం సంస్థలు ఒక్కసారిగా ధరలు పెంచుతూ చందాదార్లను ఆశ్చర్యానికి గురి చేశాయి. ఈ పరిణామంతో.. మొబైల్​వినియోగదారులపైదాదాపు 50 శాతం అదనపు భారం పడనుంది.

మొదటగా వొడాఫోన్​ ఐడియా

తొలుత ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది వొడాఫోన్​ ఐడియానే. సవరించిన ధరలతో నూతన ప్లాన్లను తెలిపింది. మొబైల్​ కాల్స్​, డేటా ఛార్జీలను 50 శాతం వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వినియోగదారులు నిర్దేశించిన ఫెయిర్‌ యూసేజ్‌పాలసీ- ఎఫ్​యూపీ పరిమితి దాటిన తర్వాత ఇతర నెట్‌వర్క్‌లకు కాల్‌చేస్తే నిమిషానికి 6 పైసలు చొప్పున వసూలు చేస్తామని తెలిపింది.

వొడాఫోన్ ఐడియాలో ఉన్న అన్ని ఆల్​రౌండర్ ప్లాన్లను తొలగించి.. వాటి స్థానంలో 49, 79 రూపాయలలతో కాంబో వోచర్ రీఛార్జ్​ను తీసుకొచ్చింది.

ఇందులో రూ.49తో రీఛార్జ్ చేసుకుంటే.. రూ. 38 టాక్ టైమ్, 100 ఎంబీ డేటా, కాల్స్‌లో ప్రతి సెకనుకు 2.5 పైసల చొప్పున ఛార్జ్ చేయనున్నారు. రూ. 79 కాంబో వోచర్‌తో 64 రూపాయల టాక్‌టైం, 200 ఎంబీ డేటా లభిస్తుంది. కాల్స్‌పై ప్రతి సెకనుకు ఒక పైసా చొప్పున వసూలు చేయనున్నారు. ఈ రెండు ప్యాక్​లకు 28 రోజుల వ్యాలిడిటీ ఉండనుంది. ప్రస్తుతం ఉన్న అన్‌లిమిటెడ్‌ప్లాన్ల స్థానంలో.... డిసెంబర్‌ 3 నుంచి నూతన ప్లాన్లు అందుబాటులోకి రానున్నాయని వొడాఫోన్‌ఐడియా తెలిపింది.

అన్‌లిమిటెడ్‌ విభాగంలో వార్షిక ప్యాక్‌ అత్యధికంగా 50 శాతం పెరిగి రూ. 999 నుంచి రూ. 1499కి చేరింది. మరో వార్షిక ప్లాన్‌ 41.2 శాతం పెరిగి రూ.1699 నుంచి 2,399కి పెరిగింది. రూ. 458 ప్యాక్ ​(84 రోజులు) 31 శాతం పెరిగి రూ. 599కి చేరింది. రూ.199 ప్లాన్​ 25 శాతం పెరిగింది.

మరింత సమాచారం కోసం:ఛార్జీలు పెంచిన వొడాఫోన్ ఐడియా.. కొత్త ప్యాక్​లు ఇవే

ఇదే బాటలో ఎయిర్​టెల్​....

ఎయిర్‌టెల్‌ కూడా వొడాఫోన్‌ ఐడియా బాటలోనే నడుస్తూ ఛార్జీలను పెంచింది. నూతన ప్లాన్లు డిసెంబర్‌ 3 నుంచి అందుబాటులోకి రానున్నట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న ప్లాన్లతో పోలిస్తే కొత్త ప్లాన్లలో 50 శాతం వరకు పెరుగుదల ఉంటుందని తెలిపింది.

అన్‌లిమిటెడ్‌విభాగంలో వార్షిక ప్యాక్‌ అత్యధికంగా 50 శాతం పెరిగి రూ. 998 నుంచి రూ. 1499కి చేరింది. మరో వార్షిక ప్లాన్‌ 41.2 శాతం పెరిగి.. రూ. 1699 నుంచి రూ. 2,398కి పెరిగింది. 84 రోజుల పాటు ఉండే ప్యాక్‌ 31 శాతం పెరిగి 458 రూపాయల నుంచి రూ.599కి చేరింది.

ఎఫ్​యూపీ దాటితే నిమిషానికి ఆరు పైసలు..

ప్రస్తుతం 28 రోజుల కాలపరిమితితో ఉన్న 249 రూపాయల ప్లాన్‌ధరను 298 రూపాయలకు పెంచింది. రూ. 448 ప్లాన్‌ (82 రోజులు) ధరను 598 రూపాయలకు పెంచుతున్నట్లు ఎయిర్‌టెల్‌ తెలిపింది. నిర్దేశించిన ఎఫ్‌యూపీ లిమిట్‌దాటిన తర్వాత చేసే ఇతర నెట్‌వర్క్‌కాల్‌కు నిమిషానికి ఆరు పైసలు వసూలు చేయనున్నట్లు ప్రకటించింది. పెంచిన ధరలు రోజుకు 50 పైసల నుంచి 2 రూపాయల 85 పైసల మధ్యలో ఉండనున్నాయి. ఈ ప్లాన్‌లతో పాటు అదనంగా మరిన్ని సౌకర్యాలను కల్పిస్తున్నట్లు ఎయిర్‌టెల్‌ తెలిపింది.

పూర్తి వివరాలకై:ఎయిర్​టెల్​ ఛార్జీలు పెరిగాయ్​.. ఈ నెల 3 నుంచి అమలు

జియో కూడా...

ముకేశ్‌ అంబానీకి చెందిన ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్‌ జియో కూడా వినియోగదారులకు షాకిచ్చింది. వాయిస్‌, డేటా ఛార్జీలను 40 శాతం మేర పెంచుతున్నట్లు ప్రకటించింది. మొబైల్‌, కాల్‌ఛార్జీలను 40 శాతం వరకు పెంచిన జియో కొత్త ఆల్​ ఇన్​ వన్​ ప్లాన్లను తీసుకొస్తున్నట్లు తెలిపింది. డిసెంబర్‌ 6 నుంచి పెంచిన ధరలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.

ఇప్పటికే జియో ఎఫ్​యూపీ పరిమితి దాటితే ఇతర నెట్‌వర్క్‌కు చేసే కాల్స్‌కు నిమిషానికి ఆరు పైసలు వసూలు చేస్తోంది. నూతన ప్లాన్ల కింద వినియోగదారునికి దాదాపు 300 శాతం వరకు అదనపు ప్రయోజనాలు లభిస్తాయని జియో ప్రకటించింది.

మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి:డిసెంబర్​ 6 నుంచి 40 శాతం పెరగనున్న జియో ఛార్జీలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details