తెలంగాణ

telangana

ETV Bharat / business

చికిత్సకు కాదు.. ఆరోగ్యంగా ఉండేందుకే బీమా పథకాలు! - ఆరోగ్య బీమా

ఆరోగ్య బీమాల్లో భారీ మార్పులకు సిద్ధమైంది బీమా అభివృద్ధి, నియంత్రణ ప్రాధికార సంస్థ ఐఆర్​డీఏ. ఇందులో భాగంగా.. అనారోగ్యం పాలై చికిత్స చేయించుకునేదాని కంటే.. ముందస్తు జాగ్రత్తతో ఆరోగ్యంగా ఉండేలా బీమా పాలసీల్లో మార్పులు చేయనుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే మార్గదర్శకాలను జారీ చేసింది. మరి ముందస్తు మార్గదర్శకాల్లో ఏముందో తెలుసుకోండి ఇప్పుడే.

చికిత్సకు కాదు.. ఆరోగ్యంగా ఉండేందుకే బీమా పథకాలు!

By

Published : Nov 23, 2019, 7:31 AM IST

ఆరోగ్యబీమా లేదా మెడిక్లెయిమ్ వినియోగదారులకు వచ్చే ఏడాది నుంచి మరిన్ని ప్రయోజనాలు అందనున్నాయి. ఎందుకంటే భారత బీమా అభివృద్ధి, నియంత్రణ ప్రాధికార సంస్థ ఐఆర్​డీఏ దృష్టి.. అనారోగ్యం నుంచి సంక్షేమం వైపు మళ్లించింది. ఇంతకీ ఆ సంక్షేమాలేంటో తెలుసుకుందాం పదండి.

వచ్చే సంవత్సరం నుంచి కొత్త బీమా విధానాలు..

2020 నుంచి కొత్త బీమా పాలసీలు.. మిమ్మల్ని సంపూర్ణ ఆరోగ్యంగా ఉంచేందుకు తోడ్పడనున్నాయి.

సాధారణ ఆరోగ్య, దంత పరీక్షలను అందించడం, ప్రొటీన్​ సప్లిమెంట్​లు/హెల్త్​ బూస్టర్లు, ఔషధాలపై ప్రత్యేక డిస్కౌంట్లు ఇచ్చే బీమాలను ప్రవేశపెట్టనుంది ఐఆర్​డీఏ. అంతేకాకుండా మిమ్నల్ని సమీపంలో ఉన్న యోగా, జిమ్​ సెంటర్​లకు అనుసంధానం చేయడంలోనూ ఈ కొత్త పాలసీలు తోడ్పాటునందివ్వనున్నాయి.

కొత్త విధానాలు ఎందుకంటే..

ఏదైనా ఆరోగ్య సమస్యకు వైద్యం చేయించడం కన్నా.. ఆరోగ్య సమస్యలు రాకుండా చూసుకోవడమే ముఖ్య ఉద్దేశ్శంగా ఈ కొత్త విధానం రూపొందనుంది. ప్రస్తుతం భారత్​లో బీమా విధానం ముందుగా ఆరోగ్య సమస్యలు రాకుండా చూసుకునే కంటే.. వైద్యం చేయించేందుకే ఎక్కువ ప్రాధాన్యాన్నిస్తున్నాయి. ఈ విధానం వల్ల భవిష్యత్తులో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది.

ఆరోగ్యంపై అవగాహన..

భారత్​లో చాలా మంది అవగాహనలేమితో.. వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా సరైన ఆహార నియమాలు పాటించకపోవడం, వ్యాయామం ప్రాముఖ్యం తెలుసుకోలేకపోవడం, పొగ తాగడం వంటి చెడు అలవాట్లు ఇందుకు కారణమవుతున్నాయి.
వీటిని అడ్డుకునే ప్రయత్నాలు మాత్రం ప్రస్తుతం మీడియా ప్రకటనలకు మాత్రమే పరిమితమవుతున్నాయట.

దేశంలో 4 శాతం మందికే బీమా..

ప్రపంచంలో భారత్ ఏడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం. అయితే బీమా పరంగా చూస్తే.. కేవలం 4 శాతం మందికే ఆరోగ్య బీమా ఉండటం అందోళన చెందాల్సిన విషయం. ఆరోగ్య బీమా ఆనేది ప్రస్తుతం ప్రాథమిక అవసరం. అయితే ఇప్పుడు దాన్ని పక్కన పెడితే.. ఆ తర్వాత ఆర్థిక, మానసిక ఒత్తిళ్లలో చిక్కుకోవాల్సి వస్తుంది.

పాశ్చాత్య దేశాల్లో వ్యాధులపై అవగాహన ఇలా..

ప్రస్తుతం భయంకరమైన వ్యాధుల్లో కేన్సర్ ప్రధానంగా చెప్పుకోవాలి. ఎంతో మంది డాక్టర్లు, ఎన్​జీఓలు ప్రజల్లో కేన్సర్​ పట్ల అవగాహన పెంచుతున్నారు. వాటిలో కొన్ని ఊపిరితిత్తుల కేన్సర్, ఓరల్ కేన్సర్, సెర్వికల్​ కేన్సర్ వంటి వాటిని.. జీవన శైలిలో చిన్న చిన్న జాగ్రత్తల ద్వారా ముందుగానే అడ్డుకోవచ్చు. సిగరెట్లు మానేయడం, వాక్సినేషన్​ల ద్వారా ఆయా కేన్సర్​ల బారిన పడకుండా చూసుకోవచ్చు. రొమ్ము కేన్సర్, కాలేయ కేన్సర్ వంటి వాటిని ప్రారంభ దశలోనే గుర్తించి.. జాగ్రత్త పడొచ్చు.
పాశ్చాత్య దేశాల్లో ఈ వ్యాధుల గురించి అవగాహన కల్పించి వాటిని దరిచేరనీయకుండా.. తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోమని వైద్యులు సలహా ఇస్తుంటారు.

ఇప్పుడు భారత్​లో కొత్త సదుపాయాలు..

పాశ్చాత్య దేశాల్లో ఉన్న సదుపాయాలను.. ఇప్పుడు భారత బీమా రంగంలోకి తీసుకువచ్చేందుకు ఐఆర్​డీఏ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా కన్సల్టేషన్​, వైద్యం, హెల్త్ చెకప్​లు, డయాగ్నోసిస్, ప్రత్యేక వోచర్​ల వంటివి అందించాలని బీమా సంస్థలకు సూచించింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలనూ జారీ చేసింది.

కొత్త విధానాలతో లాభాలివే..

ఔట్ పేషెంట్ కన్సల్టేషన్​, ఔషధాలు, హెల్త్ చెకప్స్​, డయాగ్నోసిస్, పోషకాహారం, యోగా, జిమ్​ సభ్యత్వం వంటివి.. ఆరోగ్య బీమాలో అదనంగా లభించనున్నాయి.
బీమా సంస్థలందించే.. పాలసీల్లో వినియోగదారులకు అవకాశాలు పెరగనున్నాయి.

వ్యాధులను ముందుగా అడ్డుకోవడం వల్ల.. బీమా వినియోగదారులు ఆరోగ్యంగా ఉంటూ, మరింత సంతోషకరమైన జీవితాలను గడపొచ్చు.

ఇదీ చూడండి:'5 ట్రిలియన్​ డాలర్ల ఆర్థిక వ్యవస్థ ఇప్పట్లో కష్టమే'

ABOUT THE AUTHOR

...view details