తెలంగాణ

telangana

ETV Bharat / business

మెక్​డొనాల్డ్స్​  సీఈఓ తొలగింపు.. కారణమిదే!​ - ఫాస్ట్‌ఫుడ్ దిగ్గజం మెక్​డొనాల్డ్స్ డైరెక్టర్ల బోర్డు నిర్ణయం

ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన ఫాస్ట్​పుడ్​ దిగ్గజం మెక్​డొనాల్డ్స్..​ సంస్థ సీఈఓ స్టీవ్‌ ఈస్టర్‌ బ్రూక్‌ని తొలగించింది. కంపెనీకి చెందిన ఓ ఉద్యోగితో వ్యక్తిగత సంబంధాలు జరుపుతున్నారని వచ్చిన ఆరోపణలు నిజమని తేలడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది. ఆయన స్థానంలో క్రిస్​ కెంప్​ జింక్సీ నియమితులయ్యారు.

మెక్​డొనాల్డ్స్​  సీఈఓ తొలగింపు.. కారణమిదే!​

By

Published : Nov 4, 2019, 11:40 AM IST


ఫాస్ట్‌ఫుడ్ దిగ్గజం మెక్​డొనాల్డ్స్ డైరెక్టర్ల బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది​. ఒక ఉద్యోగితో వ్యక్తిగత సంబంధాలు
(రొమాంటిక్ రిలేషన్‌షిప్‌) జరుపుతున్నారని తేలడం వల్ల సీఈఓ స్టీవ్​ ఈస్టర్ ​బ్రూక్​ని బాధ్యతల నుంచి తొలగించింది.

ఆయన సంబంధాలు సంస్థ విధివిధానాలకు వ్యతిరేకంగా ఉన్నాయని పేర్కొన్న మెక్​డొనాల్డ్స్ ఇకపై స్టీవ్​కు సంస్థతో ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేసింది. బోర్డు అభిప్రాయాన్ని గౌరవించిన స్టీవ్​ తాను చేసింది పొరపాటని ఒప్పుకుని బాధ్యతల నుంచి తప్పుకున్నారు.

2015 నుంచి చీఫ్ ఎగ్జిక్యూటివ్​ ఆఫీసర్​గా ఉన్న స్టీవ్​ నేతృత్వంలో, మెక్​డొనాల్డ్స్ వాటాల ధర రెట్టింపు అయ్యింది. అయితే, అమ్మకాలు కాస్త తగ్గాయి.

ఇప్పుడు సీఈఓ ఎవరంటే..

అమెరికా మెక్​డొనాల్డ్స్ అధ్యక్షుడు, కీలక డైరెక్టర్లలో ఒకరైన క్రిస్​ కెంప్ ​జింక్సీకి సీఈఓ అధికారాలు అప్పగించింది సంస్థ. అయితే.. అంతర్జాతీయ ఆపరేటెడ్ మార్కెట్ల అధ్యక్షుడు జో ఎర్లింగర్.. అమెరికా మెక్​డొనాల్డ్స్ ​అధిపతిగా బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలిపింది.
ప్రపంచ వ్యాప్తంగా అగ్రస్థానంలో ఉన్న సంస్థకు ఈ ఏడాది 5.9 శాతం లాభాలు పెరిగాయి.

మీటూ ఉద్యమ ప్రభావం..

ఈ మధ్యకాలంలో కార్యాలయాల్లో అనైతిక సంబంధాలు అనేక మంది సీఈఓలను ఉద్యోగాల నుంచి వైదొలిగేలా చేశాయి. మీటూ ఉద్యమంతో కార్యాలయ సంబంధాలు మరింత సున్నితంగా మారాయి. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడితే సత్వర శిక్షలు తప్పడం లేదు.

2018లో ప్రముఖ సంస్థలు ఇంటెల్ సీఈఓ బ్రియాన్ క్రజానిచ్, యోగా అపెరల్ బ్రాండ్ చీఫ్ లారెంట్ పోట్​ డే విన్ ఉద్యోగులతో సంబంధాల కారణంగానే తమ కంపెనీలకు రాజీనామా చేశారు. 2012 లో బెస్ట్​బై సీఈఓ బ్రియాన్ డన్, 2016 లో ప్రైస్​ లైన్ సీఈఓ డారెన్ హస్టన్ రాజీనామా చేశారు.

ఇదీ చూడండి: పార పట్టి మురికి కాలువను శుభ్రం చేసిన మంత్రి!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details