తెలంగాణ

telangana

ETV Bharat / business

డీజిల్ సెగ్మెంట్​లోకి మారుతీ రీ ఎంట్రీ!

దేశీయ వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ.. వచ్చే ఏడాది డీజిల్ సెగ్మెంట్​లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వచ్చే ఏడాది మధ్యలో గానీ, పండుగ సీజన్​లో గానీ మారుతీ డీజిల్ సెగ్మెంట్ రీ ఎంట్రీ ఉండొచ్చని తెలుస్తోంది.

Maruti Suzuki set to reenter diesel segment
మారుతీ నుంచి మళ్లీ డీజిల్ కార్లు

By

Published : Dec 13, 2020, 6:10 PM IST

దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్​ఐ).. మరోసారి డీజిల్​ సెగ్మెంట్​లోకి ప్రవేశించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది మధ్యలో గానీ పండుగ సీజన్​లో గానీ మారుతీ డీజిల్ సెగ్మెంట్ రీ ఎంట్రీ ఉండొచ్చని సమాచారం.

ఎస్​యూవీ, మల్టీ పర్పస్​ వాహనాల విభాగంలో వినియోగదారులను ఆకర్షించేందుకు మారుతీ ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్​ నుంచి బీఎస్​-6 ఉద్గార నియమాలు తప్పనిసరి చేస్తూ కేంద్రం స్పష్టం చేసిన తర్వాత మారుతీ డీజిల్ విభాగ వాహనాలకు స్వస్తి చెప్పింది.

తాజాగా కంపెనీ గురుగ్రామ్​ ప్లాంట్​ అప్​గ్రేడ్ చేసే ప్రక్రియ​ మారుతీ ప్రారంభించింది. దీన్ని బట్టి చూస్తే.. వచ్చే ఏడాది మధ్యలో గానీ పండుగ సీజన్​లో గానీ.. ఈ ప్లాంట్​ నుంచి బీఎస్​-6 డీజిల్ ఇంజిన్​ల తయారీ ప్రారంభం కావచ్చని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. అయితే మారుతీ సుజుకీ మాత్రం దీనిపై ఇంకా స్పష్టమైన ప్రకటన చేయలేదు.

తొలుత ఎర్టీగా, విటారా బ్రెజ్జా డీజిల్ మోడళ్లను దేశీయ మార్కెట్లోకి తీసుకురానున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

ఇదీ చూడండి:కరోనా ప్యాకేజీపై ఆర్థిక శాఖ సమీక్ష ముఖ్యాంశాలు

ABOUT THE AUTHOR

...view details