రుణాల ఎగవేతతో పాటు.. మనీలాండరింగ్ కేసులో నిందితుడు విజయ్ మాల్యా పిటిషన్‌పై వాదనలు వినడానికి అంగీకరించింది సుప్రీంకోర్టు. తనతో పాటు తన కుటుంబసభ్యుల ఆస్తులు జప్తు చేయడాన్ని సవాల్ చేస్తూ జూన్ 27న వ్యాజ్యం దాఖలు చేశారు మాల్యా.కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు సంబంధించిన ఆస్తులను మాత్రమే ఈడీ జప్తు చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు.
మాల్యా పిటిషన్‌పై ఆగస్టు 2న సుప్రీం విచారణ - Mallya
తన ఆస్తులను జప్తు చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు విజయ్ మాల్యా. ఆగస్టు 2న వాదనలు వినడానికి అంగీకరించింది అత్యున్నత న్యాయస్థానం.
మాల్యా పిటిషన్‌పై ఆగస్టు 2న సుప్రీం విచారణ
పెండింగ్‌లో ఉన్న మరో కేసుతో పాటు ఆగస్టు 2న విచారణ జరపనుంది జస్టిస్ రంజన్‌గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం. తాజాగా మాల్యా తరఫున న్యాయవాది నారీమన్ చేసిన అభ్యర్థన మేరకు కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
రూ. 9 వేల కోట్ల మేర బ్యాంకు రుణాలు ఎగ్గొట్టిన మాల్యా.. ప్రస్తుతం లండన్‌లో తలదాచుకుంటున్నారు. ఆయనను భారత్ రప్పించే విషయమై బ్రిటన్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది మోదీ సర్కార్.