తెలంగాణ

telangana

ETV Bharat / business

వచ్చే ఏడాది బ్యాంకుల సెలవులు ఇవే! - బ్యాంకుల సెలవు వార్తలు

ఏదైన పని ఉండి బ్యాంకుకు వెళ్లి.. తీరా 'సెలవు' బోర్డు కనిపించి మీరు ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారా? అయితే ఈ సారి అలా జరగకుండా ఉండాలంటే బ్యాంకుల సెలవులు ముందుగానే తెలుసుకోవడం మేలు. ఆర్బీఐ ఇప్పటికే 2020 బ్యాంకుల సెలవులను నిర్ణయించింది. మరి ఎప్పుడెప్పుడు బ్యాంకులు సెలవుల్లో ఉండనున్నాయి అనేది ఇప్పుడే తెలుసుకోండి.

BANK HOLIDAYS
బ్యాంకుల సెలవులు

By

Published : Dec 27, 2019, 12:57 PM IST

బ్యాంకు వినియోగాదారులు ముందస్తు ప్రణాళిక వేసుకునేందుకు వీలుగా.. ఆర్బీఐ 2020 సెలవుల జాబితాను ప్రకటించింది. రిజర్వు బ్యాంక్​ ప్రకటించిన సెలవుల జాబితా మీ కోసం.

2020లో బ్యాంకుల సెలవులు

  • జనవరి 1, బుధవారం- నూతన సంవత్సర ప్రారంభం
  • జనవరి 15, బుధవారం- పొంగల్ (మకర సంక్రాంతి) దక్షిణాది రాష్ట్రాలకు.
  • జనవరి 26, ఆదివారం- గణతంత్ర్య దినోత్సవం
  • జనవరి 30, గురువారం- వసంత పంచమి
  • ఫిబ్రవరి 21, శుక్రవారం- మహాశివరాత్రి
  • మార్చి 10, మంగళవారం-హోలి
  • మార్చి 25, బుధవారం- ఉగాది
  • ఏప్రిల్​ 2, గురువారం- శ్రీరామ నవమి
  • ఏప్రిల్ 6, సోమవారం- మహవీర్ జయంతి
  • ఏప్రిల్​ 10, శుక్రవారం- గుడ్​ ఫ్రైడే
  • ఏప్రిల్​ 14, మంగళవారం- అంబేడ్కర్​ జయంతి
  • మే 1, శుక్రవారం- మే డే
  • మే 7, గురువారం-బుద్ధ పూర్ణిమ
  • జులై 31, శుక్రవారం- బక్రీద్​/ఈద్​-అల్-అదా
  • ఆగస్టు 3, సోమవారం- రక్షా బంధన్​
  • ఆగస్టు 11, మంగళవారం- జన్మాష్టమి
  • ఆగస్టు 15, శనివారం- స్వాతంత్ర్య దినోత్సవం
  • ఆగస్టు 22, శనివారం- వినాయక చవితి
  • ఆగస్టు 30, ఆదివారం- మొహర్రం
  • అక్టోబర్ 2, శుక్రవారం- గాంధీ జయంతి
  • అక్టోబర్​ 26, సోమవారం- విజయ దశమి
  • అక్టోబర్ 30, శుక్రవారం- ఈద్​-ఈ-మిలాద్​
  • నవంబర్​ 14, శనివారం- దీపావళి
  • నవంబర్​ 16, సోమవారం- భాయ్​ దూజ్​
  • నవంబర్​ 30, సోమవారం- గురునానక్ జయంతి
  • డిసెంబర్ 25, శుక్రవారం- క్రిస్మస్​

వీటితో పాటు ప్రతి ఆదివారం, ప్రతి నెల రెండు,నాలుగో శనివారాల్లోనూ బ్యాంకులకు సెలవు.

బ్యాంకులు సెలవుల్లో ఉన్నప్పటికీ.. 24x7 నెఫ్ట్ లావాదేవీలు చేసుకునేందుకు 2019 డిసెంబర్​ 16 నుంచి వెసులుబాటును కల్పిస్తోంది ఆర్బీఐ.

ఇదీ చూడండి:కొత్త బైక్​ కొనాలా? ఈ సేఫ్టీ ఫీచర్లు తప్పనిసరిగా చూడండి!

ABOUT THE AUTHOR

...view details