తెలంగాణ

telangana

ETV Bharat / business

కరోనా కాలంలోనూ ఉద్యోగులకు ఆ సంస్థ బంపర్​ ఆఫర్​ - చెమ్మనూర్ గ్రూప్ ఉద్యోగులకు జీతాల పెంపు

దేశవ్యాప్తంగా నెలకొన్న కరోనా సంక్షోభంతో చాలా సంస్థలు ఉద్యోగుల జీతాలకు కోత విధిస్తున్నాయి. మరికొన్ని సంస్థలు ఏకంగా ఉద్యోగాలే తీసేస్తున్నాయి. కానీ కేరళకు చెందిన బాబీ చెమ్మనూర్​ గ్రూప్​ సంస్థ మాత్రం ఉద్యోగుల వేతనాలు భారీగా పెంచనున్నట్లు ప్రకటిచింది. ఎందుకు?ఎలా?

bumper offer to employees in corona crisis
కరోనా సంక్షోభంలోనూ ఆ సంస్థ బంపర్ ఆఫర్​

By

Published : Apr 7, 2020, 1:35 PM IST

కరోనా వైరస్​ విజృంభిస్తున్న తరుణంలో దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ కొనసాగుతోంది. ఆ ప్రభావం దేశంలోని కంపెనీలపై పడింది. ఈ నేపథ్యంలో ఆయా సంస్థలు ఆర్థిక భారం తగ్గించుకునేందుకు వేతనాలకు కోత విధించడం, ఉద్యోగులను తగ్గించుకోవడం వంటి చర్యలకు దిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేరళకు చెందిన బాబీ చెమ్మనూర్​ గ్రూప్​ మాత్రం తమ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. తమ ఉద్యోగులందరికీ వేతనాలు పెంచుతున్నట్లు తెలిపింది.

ఈ సంస్థకు జువెలరీ, ఫినాన్స్​, రిసార్ట్​లు, టూర్స్​, ట్రావెల్స్​ సహా పలు వ్యాపారాలు ఉన్నాయి. ముందుగా నగల వ్యాపారాల్లో పని చేస్తున్న ఉద్యోగులకు 25 శాతం వేతనం పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇతర వ్యాపారాల్లోని ఉద్యోగులకూ దశల వారీగా వేతనాల పెంపు ఉంటుందని తెలిపింది.

5 లక్షల మందికి లబ్ధి..

తమ సంస్థ అభివృద్ధి కోసం క్రియాశీలకంగా కృషి చేసిన 5లక్షల మంది ఉద్యోగుల పట్ల తాము ఎంతో గర్వంగా ఉన్నట్లు బాబీ చెమ్మనూరు గ్రూప్ ఉద్ఘాటించింది.

వారి భాగస్వామ్యంతోనే..

మైక్రో ఫినాన్స్​ విభాగంలో 70,000 మంది మహిళా ఉద్యోగులు ఉన్నట్లు ఆ సంస్థ హెచ్​ఆర్​ అధిపతి రాజన్​ మీనన్​ తెలిపారు. ఈ విభాగం సంయుక్త భాగస్వామ్యంతో నడుస్తోందని.. దీని ద్వారా వచ్చే ప్రతిఫలాలు ఉద్యోగులకూ అందుతాయని పేర్కొన్నారు.

ఇప్పటికే తమ ఉద్యోగులకు చాలా మందికి ఇంటి నుంచే పని చేసే వెసులుబాటు కలిపించినట్లు పేర్కొన్నారు మీనన్​. దాన్ని ఇంకొన్నాళ్లు పొడగించినట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి:కరోనా కాలంలో అప్పు కావాలా? ఇవి తెలుసుకోండి...

ABOUT THE AUTHOR

...view details