బాయ్‌కాట్ చైనా ఉద్యమానికి సాధారణ పౌరులతో పాటు దేశీయ కంపెనీల నుంచీ మద్దతు పెరుగుతోంది. ఇందులో భాగంగానే దేశీయ పారిశ్రామిక దిగ్గజం జెఎస్డబ్ల్యూ గ్రూప్ చైనా దిగుమతులపై కీలక నిర్ణయం తీసుకుంది.
తమ గ్రూప్ చెందిన కంపెనీలు చైనా నుంచి ప్రస్తుతం ఏడాదికి 400 మిలియన్ డాలర్ల విలువైన దిగుమతులు చేసుకుంటున్నట్లు తెలిపింది. అయితే వచ్చే రెండేళ్లలో వీటిని సున్నాకు తగ్గించుకోనున్నట్లు పేర్కొంది. ఈ విషయాన్ని జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ మేనేజింగ్ డైరెక్టర్ పార్థ్ జిందాల్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.