తెలంగాణ

telangana

ETV Bharat / business

జియోలో మరో రూ.11 వేల కోట్ల విదేశీ పెట్టుబడి! - జియోకు వచ్చిన మొత్తం పెట్టుబడులు

జియో ప్లాట్​ఫామ్స్​కు విదేశీ పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. సౌదీకి చెందిన ప్రముఖ పెట్టుబడుల సంస్థ పీఐఎఫ్​ దాదాపు రూ.11 వేల కోట్లకుపైగా పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందానికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.

jio new Investments
జియోలో మరో విదేశీ సంస్థ పెట్టుబడి

By

Published : Jun 16, 2020, 12:18 PM IST

Updated : Jun 16, 2020, 1:24 PM IST

ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియోలో మరో విదేశీ సంస్థ భారీ పెట్టుబడులకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. సౌదీకి చెందిన సావరిన్ ఫండ్.. పబ్లిక్ ఇన్వెస్ట్​మెంట్ ఫండ్(పీఐఎఫ్) 2.33 శాతం వాటా కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు ప్రముఖ వార్తా సంస్థ గల్ఫ్ న్యూస్ పేర్కొంది. ఈ మొత్తం వాటాను 1.5 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ. 11 వేల కోట్లకు పైమాటే) సొంతం చేసుకోనున్నట్లు తెలిపింది.

ఇప్పటికే 9 విదేశీ సంస్థలు జియోలో 22.38 శాతం వాటాను దక్కించుకున్నాయి. ఈ సంస్థలు జియోలో మొత్తం రూ.104,326.95 కోట్లు పెట్టుబడి పెట్టాయి.

జియోలో విదేశీ పెట్టుబడులు


జియో ప్రణాళిక..

2021 వరకు సంస్థను రుణరహితంగా మార్చాలని రిలయన్స్ భావిస్తోంది. ఇందులో భాగంగానే జియో వరుస పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఇందుకోసం జియోలో 25 శాతం మైనారిటీ వాటాను వాటాదార్లకు విక్రయించాలని నిర్ణయించింది. పీఐఎఫ్ ఒప్పందం కుదిరితే జియోలో వాటా విక్రయాల ప్రక్రియ దాదాపు పూర్తయినట్లేనని తెలుస్తోంది.

Last Updated : Jun 16, 2020, 1:24 PM IST

ABOUT THE AUTHOR

...view details