టెలికాం రంగంలో వినూత్న మార్పులు తీసుకొచ్చిన రిలయన్స్ జియో మరోసారి వైర్‌లెస్ డేటా టారిఫ్‌లను పెంచే యోచనలో ఉంది. ప్రస్తుతం ఒక జీబీ డేటాకు ఉన్న రూ.15 ఛార్జీని.. రూ.20కి పెంచేందుకు అనుమతి కోరుతూ ట్రాయ్‌కు లేఖ రాసింది. అయితే వాయిస్ కాల్స్ ధరలను మాత్రం యథాతథంగా కొనసాగించనున్నట్లు పేర్కొంది.
పెంచిన డేటా ధరలను తక్షణమే కాకుండా ఆరు నుంచి తొమ్మిది నెలల్లో అమలు చేయాలని భావిస్తున్నట్లు లేఖలో తెలిపింది. పెరిగిన డేటా ధరలు అన్ని టారిఫ్‌లకు వర్తిస్తాయని పేర్కొంది.