తెలంగాణ

telangana

ETV Bharat / business

'జెట్' విమానం ఎగిరేదెలా?... డీజీసీఏ ఆరా

జెట్​ఎయిర్​వేస్​ను పునరుద్ధరించేందుకు యాజమాన్యం తీసుకుంటున్న చర్యలపై డీజీసీఏ ఆరా తీస్తోంది. జెట్​ను గట్టెక్కించేందుకు అవసరమైన సాయాన్ని అందించనున్నట్లు డీజీసీఏ వెల్లడించింది.

జెట్-డీజీసీఏ

By

Published : Apr 18, 2019, 3:46 PM IST

నిబంధనలకు లోబడి జెట్​ఎయిర్​వేస్ పునరుద్ధరణకు సహకరిస్తామని డైరెక్టర్​ జనరల్​ ఆఫ్​ సివిల్​ ఏవియేషన్ (డీజీసీఏ) తెలిపింది. అందుకు బలమైన, నమ్మకమైన పునరుద్ధరణ ప్రణాళిక కోరనున్నట్లు తెలిపింది.

నియంత్రణ చట్రానికి లోబడి అవసరమైన సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు డీజీసీఏ సీనియర్ అధికారి తెలిపారు.

ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన జెట్ ఎయిర్​వేస్​ గత అర్థరాత్రి నుంచి కార్యకలాపాలు నిలిపివేసిన నేపథ్యంలో డీజీసీఏ ఈ ప్రకటన చేసింది.

జెట్ కార్యకలాపాలు నిలిచిపోయిన అనంతరం నెలకొన్న పరిస్థితులపై దేశంలోని పలు విమానాశ్రయ నిర్వాహకులతో పౌర విమానయాన కార్యదర్శి ప్రదీప్​ సింగ్​ ఖరోలా సమావేశమయ్యారు. ఈ భేటీకి ఎయిర్​పోర్ట్స్ అథారిటీ ఆఫ్​ ఇండియా (ఏఏఐ) అధికారులు హాజరయ్యారు.

జెట్​ సంస్థ సేవలు నిలిపేసిన కారణంగా విమాన ఛార్జీలు పెరగకుండా ఉండటం సహా ఇతర అంశాలపై చర్చించేందుకు... విమానయాన సంస్థల ప్రతినిధులతోనూ సమావేశం కానున్నారు.

దాదాపు రూ.8,000 కోట్ల అప్పుల్లో చిక్కుకున్న జెట్​లోని వాటా విక్రయానికి రుణదాతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

ABOUT THE AUTHOR

...view details