తెలంగాణ

telangana

ETV Bharat / business

జెఫ్ బెజోస్ వాటాల విక్రయం- బ్లూఆరిజిన్ కోసమేనా! - Amazon shares

ప్రపంచ ధనవంతుడు జెఫ్ బెజోస్ తన షేర్లను విక్రయించారు. బ్లూఆరిజిన్ సంస్థలో పెట్టుబడుల కోసమే వాటాలు అమ్మినట్లు తెలుస్తోంది. 3.1 బిలియన్ డాలర్ల విలువైన వాటాలు విక్రయించినట్లు సమాచారం.

Jeff Bezos sells over USD 3.1 billion in Amazon shares
జెఫ్ బెజోస్ వాటాల విక్రయం- బ్లూఆరిజిన్ కోసమేనా!

By

Published : Aug 7, 2020, 5:33 AM IST

అపర కుబేరుడు, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ తన షేర్లను విక్రయించారు. అమెరికా సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజీ కమిషన్​కు తెలిపిన వివరాల ప్రకారం 3.1 బిలియన్ డాలర్లు విలువైన వాటాలను విక్రయించినట్లు తెలుస్తోంది.

3.1 బిలియన్ డాలర్లలో పన్నుల చెల్లింపు తర్వాత 2.4 బిలియన్ డాలర్లు బెజోస్ చేతికి అందనున్నట్లు ఫోర్బ్స్​ సంస్థ వెల్లడించింది.

బ్లూఆరిజిన్ కోసమే!

ఈ వాటాల విక్రయానికి గల కారణాలు తెలియలేదు. అయితే బ్లూఆరిజిన్ అంతరిక్ష సంస్థ కోసం ప్రతీ సంవత్సరం అమెజాన్​ షేర్లలో ఒక బిలియన్ విలువైన వాటాలను విక్రయించనున్నట్లు గతంలో బెజోస్ వెల్లడించారు. 2019లో 2.8 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను విక్రయించారు. ప్రస్తుతం బెజోస్ వద్ద 54 మిలియన్ వాటాలు ఉన్నాయి.

ABOUT THE AUTHOR

...view details