తెలంగాణ

telangana

By

Published : Mar 13, 2020, 6:43 PM IST

ETV Bharat / business

ఐఓసీ మధ్యంతర డివిడెండ్ 42.5 శాతం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది చమురు మార్కెటింగ్​ సంస్థ ఇండియన్ ఆయిల్​ కార్పొరేషన్. రూ.10 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు 42.50 శాతం డివిడెండ్ చెల్లించనున్నట్లు తెలిపింది.

IOC DIVIDEND
ఐఓసీ డివిడెండు

ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) మధ్యంతర డివిడెండ్​ ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019-20) ఒక్కో షేరుకు రూ.4.25 డివిడెండ్ చెల్లించనున్నట్లు తెలిపింది.

  • ముఖ విలువ రూ.10 కలిగిన షేరుకు 42.50 శాతం( రూ.4.25) మధ్యంతర డివిడెండ్ కింద​ చెల్లించాలని ఐఓసీ బోర్డు నిర్ణయించింది.
  • ఐఓసీలో కేంద్రానికి 51.50 శాతం వాటా ఉంది. డివిడెండ్ రూపంలో కేంద్రం రూ.2,060 కోట్లు (పన్నులు అదనం) దక్కించుకోనుంది.
  • మార్చి 31 లోపు వాటాదారుల ఖాతాలోకి డివిడెండ్ జమకానుంది.
  • డివిడెండ్ పొందేందుకు అర్హులైన వాటాదారులను నిర్ధరించేందుకు మార్చి 25ను రికార్డు తేదీగా నిర్ణయించింది ఐఓసీ బోర్డు.

ABOUT THE AUTHOR

...view details