తెలంగాణ

telangana

ETV Bharat / business

నాలుగో త్రైమాసికంలో ఐటీ దిగ్గజాల జోరు - tata tcs

దేశీయ ఐటీ దిగ్గజాలు నాలుగో త్రైమాసికంలో భారీ లాభాలు ఆర్జించాయి. టీసీఎస్ 17.7 శాతం, ఇన్ఫోసిస్ 10.5 శాతం వృద్ధి సాధించాయి.

నాలుగో త్రైమాసికంలో ఐటీ దిగ్గజాల జోరు

By

Published : Apr 13, 2019, 7:07 AM IST

2018-19 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో దేశీయ ఐటీ దిగ్గజాలు భారీ లాభాలను ఆర్జించాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) 17.7 శాతం వృద్ధితో రూ.8,126 కోట్ల నికర లాభం గడించింది. ఇన్ఫోసిస్​ 10.5 శాతం వృద్ధి సాధించి రూ.4,078 కోట్ల లాభం పొందింది.

టీసీఎస్​లో పెరుగుదల

గతేడాదితో పోలిస్తే టీసీఎస్​ వృద్ధిరేటు భారీగా పెరిగింది. 2019 మార్చిలో రూ.6,904 కోట్లను ఆర్జించింది. మొత్తంగా 2018-19 ఆర్థిక సంవత్సరానికి 21.9 శాతం వృద్ధితో రూ. 32, 472 కోట్ల లాభం ఆర్జించింది. కంపెనీ విలువ 19 శాతం పెరిగి 1.46 లక్షల కోట్లకు చేరింది.

ఇన్ఫోసిస్​లో...

2019 ఆర్థిక సంవత్సరం మొత్తంగా చూస్తే 3.9 శాతానికి తగ్గి రూ. 15, 410 కోట్ల నికర లాభం గడించింది ఇన్ఫోసిస్​. కంపెనీ విలువ 17.2 శాతానికి పెరిగి రూ. 82,675 కోట్లకు చేరింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details