తెలంగాణ

telangana

ETV Bharat / business

రెండో త్రైమాసికంలో ఇన్ఫోసిస్​కు లాభాల పంట

భారత దిగ్గజ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ రెండో త్రైమాసికం ఫలితాలను ప్రకటించింది. నికర లాభం 20.5 శాతం, ఆదాయంలో 8.5 శాతం వృద్ధి సాధించినట్లు పేర్కొంది.

By

Published : Oct 14, 2020, 6:58 PM IST

Updated : Oct 15, 2020, 2:30 AM IST

Infosys
ఇన్ఫోసిస్

ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్​కు లాభాల పంట పండింది. రెండో త్రైమాసికంలో మెరుగైన ఫలితాలు సాధించింది. నికర లాభం 20.5 శాతం పెరిగి రూ.4,845 కోట్లకు చేరిందని సంస్థ ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంలో రూ.4,019 కోట్ల నికర లాభాన్ని ఇన్ఫోసిస్ సాధించింది. ఫలితంగా సంస్థ ఆదాయం 8.5 శాతం పెరిగి రూ.24,570కి చేరింది.

గతేడాది రూ.22,629 కోట్లను ఆర్జించిన ఇన్ఫోసిస్​.. 2021 ఆర్థిక సంవత్సరంలో 2-3 శాతం వృద్ధి సాధిస్తామని అంచనా వేసింది. సంస్థ ఈక్విటీ షేరుకు రూ.12 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది.

ఉద్యోగులకు బొనాంజా..

బలమైన త్రైమాసిక ఫలితాలకు కారణమైన తమ ఉద్యోగులకు రెండో త్రైమాసికంలో ప్రత్యేక ప్రోత్సాహకంతో పాటు 100 శాతం వేరియబుల్​ పే ఇస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

''మా జూనియర్​ ఉద్యోగులకు మూడో త్రైమాసికంలో ఏకకాల ప్రత్యేక ప్రోత్సాహకం ఇస్తాం. ఇవి కాకుండా వేతన పెంపు ప్రక్రియను పునఃప్రారంభిస్తున్నాం. గత త్రైమాసికంలోనే జూనియర్​ స్థాయిలో పదోన్నతులు ఇస్తామని'' కంపెనీ సీఈఓ ప్రవీణ్​ రావు తెలిపారు. అంతకుముందు ఏడాదుల్లో ఇచ్చిన పరిమాణంలోనే వేతన పెంపు ఉంటుందని స్పష్టం చేశారు. గతేడాది సగటున వేతనపెంపు 6 శాతంగా ఉండగా.. విదేశాల్లో 1-1.5 శాతంగా ఉంది.

ఇదీ చూడండి:క్యూ2లో లాభం తగ్గినా.. విప్రో భారీ బై బ్యాక్ ప్లాన్​

Last Updated : Oct 15, 2020, 2:30 AM IST

ABOUT THE AUTHOR

...view details