దేశీయ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ అవినీతికి పాల్పడ్డట్టు మరో లేఖ బయటపడింది. ఇటీవలే సలీల్ పరేఖ్ సహా.. సంస్థ సీఎఫ్ఓ నిలంజన్ రాయ్‌లు అనైతిక కార్యకలాపాలకు పాల్పడ్డట్టు ఓ ప్రజావేగుసంస్థ లేఖ ఇటీవల సంచలనం రేపిన విషయం తెలిసిందే. తాజా లేఖలో సీఈఓ సలీల్ పరేఖ్‌పై వ్యక్తిగత ఆరోపణలను ప్రస్తావించారు.
పరేఖ్ తన గ్రీన్ కార్డ్‌ను కాపాడుకునేందుకు.. ప్రతి నెలా అమెరికాకు వెళ్లేవారని. అయితే అక్కడ సంస్థ క్లయింట్లను కలవడం గానీ.. ఆఫీస్‌ను సందర్శించడం గానీ చేయలేదని లేఖలో ఉన్నట్లు తెలిసింది.
"పరేఖ్ బెంగళూరులోని ఇన్ఫీ ప్రధాన కార్యాలయంలో ఉండకుండా ముంబయిలో ఉండటానికే ఇష్టపడుతున్నారు. ఇది కంపెనీ నిబంధనలకు విరుద్ధం. పలు చిన్న కంపెనీల్లో ఆయనకు ఉన్న పెట్టుబడులను కాపాడుకునేందుకే ఇలా చేస్తున్నారు" అని లేఖలో ఆరోపించారు.