తెలంగాణ

telangana

ETV Bharat / business

మోదీకి పరిశ్రమ వర్గాల అభినందనలు

సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది. పరిశ్రమ దిగ్గజాలు మోదీ, భాజపాలను శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు.

మోదీ

By

Published : May 23, 2019, 4:29 PM IST

ప్రపంచ అగ్రగామిగా భారత్ వృద్ధి చెందాల్సిన సమయం ఆసన్నమైందని దేశీయ పరిశ్రమ దిగ్గజాలు ఆది గోద్రేజ్​, అనిల్ అగర్వాల్​, ఉదయ్​ కోటక్​ ఉద్ఘాటించారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో మోదీ మరోసారి ప్రభంజనం సృష్టిస్తున్న నేపథ్యంలో సామాజిక మాధ్యమాల వేదికగా వారు అభినందనలు తెలిపారు.

ప్రజాస్వామ్య విజయం

మోదీ హవాపై ఆనందం వ్యక్తం చేశారు వేదాంత రిసోర్స్ ఛైర్మన్​ అనిల్ అగర్వాల్​. మోదీ రెండో ఇన్నింగ్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.

"హృదయానికి ఆనందాన్ని కలిగించే వార్తలు వస్తున్నాయి. ప్రజాస్వామ్యం విజయం సాధించింది. భారత ప్రజానీకం అభివృద్ధికి ఓటు వేశారు. మోదీ తదుపరి ప్రగతిశీల ఇన్నింగ్స్​పై ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న భారత్​కు మోదీ సంస్కరణలు మరింత ఊతమందిస్తాయని భావిస్తున్నాం."
-అనిల్ అగర్వాల్​, వేదాంత రిసోర్స్​ ఛైర్మన్

ఇది సంస్కరణల సమయం

"ప్రపంచ ఆగ్రరాజ్యంగా భారత్ ఎదిగేందుకు ఇదొక మంచి సమయం. సంస్కరణలకు ఇదొక శుభ సూచకం. విశ్వశక్తిగా భారత్ ఎదగాలని నా చిరకాల స్వప్నం. ఆ కల నెరవేరుతుందని ఆశిస్తున్నా. నరేంద్ర మోదీకి, భాజపా, ఎన్డీఏకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు."
-ఉదయ్ కోటక్, కోటక్ మహీంద్రా బ్యాంకు వ్యవస్థాపక ఛైర్మన్​

వృద్ధికి దోహదం చేస్తారని...

"కొత్త ప్రభుత్వం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వద్ధికి ప్రోత్సాహం అందిస్తుందని ఆశిస్తున్నాం. ​ముందుగా ప్రకటించినట్లుగానే కార్పొరేట్​ పన్నులను 25 శాతానికి తగ్గిస్తుందని ఆకాంక్షిస్తున్నాం. ఇప్పటికే చిన్న సంస్థలకు అమలు చేసిన ఈ సంస్కరణలు త్వరలోనే పెద్ద సంస్థలకు కూడా వర్తింపజేస్తారని అనుకుంటున్నాం."
-ఆది గోద్రేజ్​, గోద్రేజ్ గ్రూపు ఛైర్మన్​

ABOUT THE AUTHOR

...view details