బడ్జెట్ విమానయాన సంస్థ ఇండిగో వైద్యులు, నర్సులకు ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. కరోనా వైరస్‌పై పోరులో ముందున్న డాక్టర్లు, నర్సులు తమ విమానాల్లో ప్రయాణిస్తే 25 శాతం రాయితీ ఇస్తున్నట్లు వెల్లడించింది.
కంపెనీ అధికారిక వెబ్సైట్ ద్వారా టికెట్ బుక్ చేసుకునే వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ ఆఫర్లో టికెట్ బుక్ చేసుకున్న వైద్యులు, నర్సులు.. చెక్ ఇన్ సమయంలో వారు పని చేసే ఆస్పత్రి ఐడీ కార్డును చూపించాల్సి ఉంటుందని ఇండిగో స్పష్టం చేసింది.
జులై 1న ప్రారంభమైన ఈ ఆఫర్ ఈ ఏడాది చివరి వరకు అందుబాటులో ఉంటుందని వెల్లడించింది ఇండిగో.